తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఇందులో ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది... రైజింగ్ రాజు.  హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే కామెడీ పంచ్ లు పేలిపోతాయి.. పొట్ట చెక్కలు కావాల్సిందే అంటారు.  గత కొంత కాలంగా ఆయన కొంత మంది నటులను అనుకరిస్తూ కామెడీ చేస్తున్న విషయం తెలిసిందే.  హైపర్ ఆది టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైజింగ్ రాజు తర్వాత దొరబాబు.  గతంలో దొరబాబు అడల్ట్ కామెడీ లో నటించిన విషయం తెలిసిందే.  ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు.

 

విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ  దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి.. ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు విటుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  అందులో దొరబాబు, పరదేశి ఉన్నారు.  అయితే వీరిద్దరిని పోలీసులు చూసి అవాక్కయ్యారట... ఆ సమయంలో తమను వదిలేయాలని ప్రాదేయపడ్డట్టు సమాచారం. ప్రస్తుతం దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

 

ఇదిలా ఉంటే.. దొరబాబు నిన్న అరెస్ట్ అయిన బాధలో ఉంటే.. ఆయనకు ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది ఆయన సతీమణి.  దొరబాబు తన భార్యతో కలిసే విశాఖపట్నం వెళ్లినట్టు తెలుస్తోంది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన నెల్లూరు చెందిన లోకల్ ఛానల్‌ యాంకర్‌ అమూల్య రెడ్డి అలియాస్ నందినిని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. తాజాగా డి ఫర్ దొరబాబు, మై లైఫ్ లవ్ యు సోమచ్ బుజ్జీ అంటూ టాటూ వేయించుకుంది దొరబాబు భార్య నందు. అరెస్ట్ అయిన రోజే ఈ టాటు వైరల్ కావడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: