కాజల్ అగర్వాల్ టాలీవుడ్ అభిమానులకు పరిచయం లేని పేరు. ఈ భామ ఇండస్ట్రీకి పరిచయమయ్యి 15 ఏళ్లు గడుస్తోంది. అయినా ఈ అమ్మడుకు ఇంకా క్రేజ్ తగ్గలేదు. అంటే ఈ బ్యూటీ ఏం రేంజ్ లో తన అందచందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుందనేది అర్దం చేసుకోవచ్చు. కాజల్ అగర్వాల్ లక్షీకల్యానం మూవీతో టాలీవుడ్ కి ఎంటర్ అయింది. అప్పటి నుంచి ఎన్ని వడిదుడుకులు వచ్చిన అన్ని తట్టుకుంటూ మంచి క్రేజ్ సంపాదించకుంది.

 

 

 

కాగా., కాజల్.. సీత, రణరంగం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈమె ప్రస్తుతం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుంది. ఈ విరామంలో హాలిడే ట్రిప్ కు వెళ్ళింది. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రధానంగా రెండు సినిమాలు ఉన్నాయి. హిందీలో ‘ముంబై సాగా’ అనే సినిమాలో కాజల్ నటిస్తోంది. అలాగే, కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఇండియన్ 2’లోనూ కీలక పాత్ర పోషిస్తోందట. తెలుగులో అయితే ఏ సినిమాను కాజల్ ఒప్పుకోలేదు.

 

 

 

ట్రిప్ కు వెళ్లి బికినీలో తీసుకున్న కొన్ని ఫొటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలలో కాజల్ సెగలు పుట్టిస్తుందనుకొండి. ఈ ఫొటోలను వరసపెట్టి కాజల్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఉక్కిరిబిక్కిరైపోయారు. ఇప్పటివరకు ఎంత అందచందాలను ఆరబోసిన బికినీలో మాత్రం కిర్రేకిస్తోంది ఈ భామ. 

 

 

 

టాలీవుడ్ లో  రోజుకో కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. దీంతో ఈ బొమ్మకు క్రేజ్ తగ్గుతుందనే భయంతో.. ఇండస్ట్రీలో ఉండాలంటే అందాలను కాపాడుకోవడమే కాదు ప్రదర్శించడం కూడా తెలిసుండాలి. ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తుంది ఈ బ్యూటీ. రోజుకో విధంగా మత్తెక్కిస్తు తన బికినీ ఫోటోలను షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన అందాలను చూపించి ఆకట్టుకోవడానికి ఏకంగా బికినీ అస్త్రాన్నే ప్రయోగించింది కాజల్.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: