ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ఒకరోజు కేటాయించి వారి కోసం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకొంటారు. మదర్స్ డే,ఫాదర్స్ డే,  లవర్స్ డే,  ఫ్రెండ్షిప్ డే... ఇలా అన్ని సెలబ్రేట్ చేసినట్లుగానే... ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే ని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఉమెన్స్ డే రోజున మహిళల గొప్పతనాన్ని గురించి.. మహిళలు సాధించాల్సిన దాని గురించి ఎంతో మంది ప్రముఖులు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. మహిళా గొప్పతనాన్ని చాటి చెప్పేలా  ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాగా  మార్చి 8వ తేదీన ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు అనే విషయం తెలిసిందే. అయితే ఈ మహిళా దినోత్సవం కేవలం ఒక దేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా జరుగుతోంది. అన్ని రంగాల్లో మహిళలు... మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా... మహిళా దినోత్సవం పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా సత్తా చాటి... బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ... చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీ తమిళ తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది. అయితే తాజాగా మహిళా దినోత్సవం పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. మహిళా దినోత్సవం అనే కాన్సెప్టును తప్పు పడుతుంది ఈ అమ్మడు. కేవలం ఒక రోజు మహిళా దినోత్సవం గా సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు.. పురుషుల కోసం అంటూ ఒక ప్రత్యేక దినోత్సవం లేదు కదా అలాంటిది మహిళల కోసం ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది. 

 

 

 అయితే ప్రతిరోజు మహిళల దినోత్సవం గానే భావించాలి అని రకుల్ ప్రీత్ సింగ్ భావిస్తున్నట్లుగా రకుల్ చేసిన వ్యాఖ్యల్లో మీనింగ్ ఉన్నప్పటికీ... ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మహిళల దినోత్సవం మాత్రం జరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా... రకుల్ ఏదైనా వివాదాన్ని రాజేస్తుందా  అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై మాత్రం నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: