టాలీవుడ్ లో త్రివిక్రమ్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు ప్రేక్షకులు క్యూ కడుతూ ఉంటారు. ప్రస్తుతం అల వైకుంఠపురములో సక్సెస్ లో ఉన్నాడు ఈ స్టార్ దర్శకుడు. తన మాటలతో అభిమానులను సంపాదించుకున్న ఈ దర్శకుడు టాలీవుడ్ లో అదే స్థాయిలో హీరోలను కూడా అభిమానులను చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అన్ని రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాను రెండు నెలలలో సెట్స్ మీదకు తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్నాడు. 

 

ఈ సినిమాలో రాజకీయ కోణంలో జూనియర్ ఎన్టీఆర్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్దమైందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా విషయంలో అతను చాలా దూకుడుగా ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా తర్వాత మరో సినిమాను అల్లు అర్జున్ తో చేయడానికి రెడీ అయ్యాడట ఈ స్టార్ దర్శకుడు. అల్లు అర్జున్ కి మాట కూడా ఇచ్చినట్టు సమాచారం. అల్లు అరవింద్ కి కూడా చెప్పినట్టు సమాచారం. వచ్చే ఏడాది దసరా కోసం వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం త్రివిక్ర౦ చాలా తొందరపడుతున్నాడని, ఎన్టీఆర్ తో సినిమాను వేగంగా పూర్తి చేసి తర్వాతి ప్రాజెక్ట్ ల మీద ఫోకస్ చెయ్యాలని చూస్తున్నాడట. మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమా దాదాపుగా ఓకే అయిందని అంటున్నారు. వంశీ పైడపల్లి తో చేసే సినిమా తర్వాత ఆ సినిమాను చెయ్యాలని చూస్తున్నాడు. వచ్చే రెండు మూడేళ్ళకు ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాడు ఈ స్టార్ దర్శకుడు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈ సినిమాలు అన్నీ చేస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: