పాత తరం సినిమాల్లో అతి చిన్న వయసులోనే ఎక్కువ వయసు ఉన్న పాత్రల్లో నటించి తనకు సాటి ఎవరూ లేరు అనిపించుకున్నారు గుమ్మడి. అప్పట్లో స్టార్ హీరోలుగా వెలిగిపోయిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు ల కన్నా వయసులో చిన్నవాడైన గుమ్మడి వారికి తండ్రి పాత్రల్లో నటించి మెప్పించరు.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు గుమ్మడి.  ఆ తరమే కాదు మొన్నటి తరం వరకు తాతయ్య పాత్రల్లో నటించారు.  గుమ్మడి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేక అభిమానం ఉండేది.. ఆయన అంటే సినీయర్, జూనియర్ ఏ నటులైనా ఎంతో గౌరవంగా పలకరించేవారని అంటారు. అలాంటి గుమ్మడిపై నటసార్వభౌములు ఎన్టీఆర్ సెట్స్ లోనే సిరియస్ అయ్యారట.  ఈ విషయం ప్రముఖ నిర్మాత  త్రిపురనేని చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  

 

ఈ మద్య కొంత మంది హీరోలు షూటింగ్ సమయంలో క్యారవ్యాన్ లోకి తమ ఫ్రెండ్స్ ని తీసుకుని రావడం.. ఖాళీ సమయంలో కార్డ్స్ ఆడుకోవడం.. ఎంజాయ్ చేయడం లాంటి చేస్తున్నారు.  తాజాగా ఈ విషయంపై నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు సెట్స్ లో సీనియర్ నటులు ఎంత సీరియస్ గా పనిచేసేవారో అందుకే వారు గొప్ప నటులు అయ్యారని అన్నారు.  అప్పట్లో ఓ చిత్రం షూటింగ్ సమయంలో గుమ్మడి చేసిన చిన్న పొరపాటుకు ఎన్టీఆర్ సెట్స్ లోనే ఆయనను మందలించారు.  ఎన్టీఆర్ కాంబినేషన్లో చేసే సీన్ కి ఆయన రావాలి... ఆ సమయంలో కెమెరా ముందుకు ఎన్టీఆర్ వచ్చినా, గుమ్మడి గారు 'ఒక్క నిమిషం' అని చెప్పేసి కామెంట్రీ వింటున్నారు.

 

'గవాస్కర్ సెంచరీ కొట్టాడు..' అంటూ ఆయన నవ్వుతూ రాగానే, "మీరు పెద్దవారు .. ఇలా చేయడం కరెక్ట్ కాదు. గవాస్కర్ ఎన్ని కొడితే మనకెందుకు?  ఇక్క నిర్మాతలు మనకోసం లక్షలు ఖర్చు పెట్టి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. వారికి కనీస గౌరవం ఇవ్వాలి కదా అని అన్నారట. అంతే అప్పటి నుంచి గుమ్మడి సెట్స్ లోకి వచ్చాక సీరియస్ గా ఆయన పనిచూసుకుని వెళ్లే వారని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: