కరోనా.. కరోనా.. కరోనా.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తుంది.  చైనాలో పుహాన్ లో మొదలైన ఈ భయంకరమైన వైర ఇప్పుడు 60 దేశాల్లోని ప్రజలను గజ గజ వణికిస్తుంది.  అయితే కరోనాకు ఇప్పటి వరకు మంది కనిపెట్టలేకపోయారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)చైనాతో పాటు ప్రపంచదేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌరులు షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకోవడానికి దూరంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.  ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కొంత మంది ఆటలా తయారైంది.  ఎవరి ఇష్టం వచ్చినట్లు కోరానాపై ఫన్నీ వీడియోలు తయారు చేస్తున్నారు. 

 

ఇక సోషల్ మాద్యమాల్లో గ్రాఫిక్ ఫోటోలకు అంతే లేకుండా పోతుంది. కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ రంగంపై కూడా ప్రభావం పడుతుంది. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఒక్కటేమిటి ఎక్కువగా మనుషులు ఉండే ప్రదేశాలు మొత్తం నిర్మాణుష్యంగా మారుతున్నాయి.  ఎవరికి వారే కరోనా భయంతో మాస్కులు ధరించి బయట తిరుగుతున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  కరోనా వచ్చింది అని చెప్పి హెయిర్ కట్ చేయించుకోకుండా ఉండలేరు కదా.  మరి వారి పరిస్థితి ఏంటి.  ఎలా కటింగ్ చేయించుకుంటారు..దీనికి సంబంధించిన ఓ వీడియోను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

 

ఓ వ్యక్తి రెండు కర్రలతో ట్రిమ్మర్ ని సెట్ చేసి కటింగ్ చేస్తున్నాడు.  అయితే ఇది కరోనా నుంచి తప్పించుకోవడానికి అయినా..చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.   తేడా వస్తే మనోడి మెడ కట్ అవుతుందని అంటున్న కామెంట్స్ చేస్తున్నారు.   అయితే నిన్న కూడా రాంగోపాల్ వర్మ కరోనా వైరస్ కి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.  నువ్వో పరాన్న జీవివి.. నువ్వూ మాతో పాటే చచ్చిపోతావు.. అంటూ ఫన్నీ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: