టాలీవుడ్ లోకి రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100తో మంచి విజయం అందుకుంది.  ఈ మూవీపై మొదట ఎన్నో విమర్శలు వచ్చాయి.  కానీ గ్రామీణ వాతావరణంలో ఓ భగ్నప్రేమికుడిగా హీరో హీరోయిన్ చేతిలో ఎలా మోసపోతాడు అన్న కోణంలో కథ సాగుతుంది.  సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి.  మొత్తానికి ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. బాక్సాఫీస్ వసూళ్లు కూడా బాగానే సాధించింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత పాయల్ రాజ్ పూత్ కి మంచి అవకాశాలు వచ్చాయి.  అయితే ఆర్‌ఎక్స్‌ 100తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తొలినాళ్లలో ఇబ్బందులు ఎదురయ్యాయట.  అలాంటి ముఖాన్ని చూసి కొందరు నీ ముఖం దక్షిణాది సినిమాలకు పనికిరాదన్నారని అంటూ తన అనుభవాన్ని తెలిపింది.

 

కానీ ఆ విమర్శలు విన్నతర్వాత నేను వెనక్కి వెళ్లకుండా ఇక్కడే ఏదైనా సాధించాలన్న పట్టుదల పెరిగిపోయింది. విమర్శ వల్ల నాకు మంచే జరిగింది అని చెప్పుకొచ్చింది. తెరపై తాను కనిపిస్తున్న పాత్రల గురించి అడిగితే… సినిమాల విషయాలు అమ్మతో పంచుకుంటాను. అంతే కాదు ఆ మూవీలోని రొమాంటిక్ సన్నివేశాల గురించి కూడా అమ్మతో ప్రస్థావిస్తాను.. అయితే ప్రఫెషనల్ అన్న తర్వాత దేనికైనా సిద్దంగా ఉండాలని మా అమ్మధైర్యం చెప్పేది.  అయితే బోల్డ్‌ పాత్రలు ఎంత ఇష్టపడి చేసినా సరే వాటిని పేరెంట్స్‌తో కలిసి చూడాలంటే మాత్రం ఇబ్బందిగా ఫీలవుతాను.

 

అలాంటి పాత్రలు చేయవద్దని వాళ్ళూ చెప్పరు అని పాయల్‌ స్పష్టం చేసింది.  ఆ మద్య తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించినానని.. ఇకపై ఐటమ్ సాంగ్స్ జోలికి వెళ్లనని అంటుంది.  నాకు బాలీవుడ్‌ వెళ్లే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. దక్షిణాదిలోనే కంఫర్ట్‌బుల్‌గా ఉంది. పెళ్లి గురించి ఇంకా ఆలోచన లేదు. నాకు తగ్గట్టుగా ఉండే వరుడు కావాలి. నేను అలిగితే బుజ్జగించేలా ఉండాలి. పరిశ్రమ వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అంటూ పాయల్‌ స్పష్టత ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: