టాలీవుడ్ లోకి తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యానం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్.  ఈ మూవీ పెద్దగా ఆకర్షించకపోయినా.. రామ్ చరణ్ తో ‘మగధీర’లో ఛాన్స్ కొట్టేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మగధీర’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న కాజల్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  తెలుగు లోనే కాదు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించింది.  పుష్కరకాలం అయినా ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతోనే నటిస్తానని చెప్పిన కాజల్.. ప్రస్తుతం యంగ్ హీరోల సరసన కూడా నటిస్తుంది.  దక్షిణాదిన భారీ పారితోషికం తీసుకునే తారగా పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్లు పదేళ్ల కంటే ఎక్కువ కాలం రాణించడం చాలా అరుదు.  

 

ఎందుకంటే ఎప్పుడూ వెండితెరపై కొత్త హీరోయిన్లు సందడి చేస్తుంటారు. అందులోనూ వివిధ భాషల్లో నటించే హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం కావడం..  ఇక్కడ సక్సెస్ సాధించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కాజల్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. టాలీవుడ్ లో ముంబాయి హీరోయిన్ల ఎక్కువగా రావడంతో కాజల్‌ వంటి సీనియర్లకు సహజంగానే అవకాశాలు తగ్గాయి. యువ హీరోలు కల్యాణ్‌ రామ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి హీరోలతో నటించినా అవి వర్కవుట్‌ కాలేదు.  టాలీవుడ్‌లో కాజల్‌ పని అయినపోయినట్టే అనే ప్రచారం జరుగుతున్నా సరే అవకాశాలు వెతుక్కుంటూ దొరకబుచ్చుకుంటోంది.  

 

ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్ళు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.  అయితే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 మూవీలో కాజల్ నటిస్తున్నప్పటికీ.. ఈ మద్య జరిగిన అంతరాయం వల్ల ఎప్పుడు మళ్లీ షూటింగ్ ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. ఇక ముంబై సాగ హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. ఒకే సారి మూడు భాషల్లో నటించడం వల్ల వీటిలో ఏదో ఒక సినిమా హిట్‌ అయినా సరే మళ్లి  అవకాశాలు వస్తాయని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: