గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తోంది మహమ్మారి కరోనా వైరస్.. చైనా, జపాన్, సౌత్ కొరియా మరికొన్ని దేశాలను వణికిస్తుంది.  మొదట ఈ ప్రభావం చైనాకు మాత్రమే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది.  తాజాగా సినిమా ఇండస్ట్రీపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు హాలీవుడ్‌ సినిమాల చిత్రీకరణ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, భారత్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న నేపథ్యంలో అవుట్‌డోర్‌ షూటింగ్‌లను నిలిపివేసే అవకాశం ఉంది. తెలంగాణలో సైతం కొంత కాలం థియేటర్లు మూసివేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ వ్యాధి బారిన పడుతూ మరణాల సంఖ్య బాగా పెరిగిపోతుంది.  

 

ఈ లెక్క కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిందే. ఇప్పటికీ ఇంకా కరోనా వైరస్ విజృంభన అలాగే ఉంది. ఇప్పుడు సినీ పరిశ్రమపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుందట.  హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌ని లైక్ చేసే వారికి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.  ఇప్పటి వరకు మిషన్‌ ఇంపాజిబుల్‌ ఆరు భాగాలు వచ్చాయి.. ఏడో భాగం (మిషన్‌ ఇంపాజిబుల్‌ 7) సెట్స్‌ మీద ఉంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్‌ క్రూజ్‌ ఏడో భాగంలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ అమెరికన్‌ యాక్షన్‌ స్పై ఫిల్మ్‌పై కరోనా ఎఫెక్ట్‌ పడింది.  

 

మరోవైపు జేమ్స్ బాండ్ మూవీ కూడా వాయిదే వేస్తూ నవంబర్ లో రిలీజే చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చైనా సహా అనేక దేశాల్లో కరోనా కారణంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండడంతో, హాలీవుడ్ చిత్రాల ప్రదర్శన కూడా ప్రభావితమవుతోంది. పలు హాలీవుడ్ మూవీ విడుదల తేదీలను సైతం వాయిదా వేయాల్సి వచ్చింది.  కరోనా కారణంగా హాలీవుడ్ కు ఇప్పటివరకు 500 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. భారీ బడ్జెట్ తో తెరకెక్కే హాలీవుడ్ చిత్రాలకు ఇది పెను విఘాతం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: