ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీద గచ్చిబౌలి ప్రాంతంలో పబ్ లో వికారాబాద్ కు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి దాడి చేయడం జరిగింది. ముందుగా రాహుల్ తన స్నేహితులతో కలిసి పబ్ లోకి వచ్చిన సందర్భంలో  ఎమ్మెల్యే తమ్ముడు వర్గానికి చెందిన వాళ్లు రాహుల్ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయిని ఏడి పెంచడంతో ఈ గొడవ స్టార్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం ఎక్కువ అవటంతో రితేష్ రెడ్డి వెంటనే పక్కనే ఉన్న బీరు బాటిల్ పట్టుకుని రాహుల్ తలపై బలంగా కొట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ రాహుల్ తో వచ్చిన అమ్మాయి పునర్నవి అని చాలామంది అంటున్నారు.

 

ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు మరియు మీడియా వాళ్లు తాజాగా జరిగిన ఘటనపై పునర్నవి ని సంప్రదించాలని ప్రయత్నం చేయగా ఆమె రెస్పాండ్ కావడం లేదని సమాచారం వస్తుంది. అయితే మరోపక్క రాహుల్ పై జరిగిన దాడిని తెలుసుకొని పునర్నవి బాధ పడింది అని ఏడ్చింది అని స్నేహితులు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ పునర్నవి రాహుల్ తో పాటు పబ్ కి వచ్చిందా లేదా అన్న దాని గురించి క్లారిటీ రాలేదు. కాగా పబ్బులో తలకు బలంగా తగలడంతో  పబ్ నిర్వాహకులు.. రాహుల్‌ను సమీపంలోని హాస్పటల్‌కు తరలించారు.

 

ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత రాహుల్ తిరిగి తన ఇంటికీ వెళ్లిపోయాడు. తర్వాత రోజు అనగా గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాహుల్ సిప్లిగంజ్. ఐతే.. రితేష్ రెడ్డి సన్నిహితులు మాత్రం రాహుల్ సిప్లిగంజ్.. తమతో వచ్చిన ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో మేము వద్దని వారించాము. కానీ అతను మా మాట వినకపోవడంతో పాటు మాపై దాడికి యత్నించడంతో మేము ఆత్మరక్షణలో భాగంగా అతనిపై దాడికి యత్నించినట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు ఈ విషయంలో న్యాయం జరగాలని రాహుల్ సిప్లిగంజ్ కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: