ఆర్.ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆ తరవాత విక్టరీ వెంకటేష్ సరసన ‘వెంకీమామ’, మాస్ మహారాజ రవితేజ తో ‘డిస్కోరాజా’ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఈ మధ్యలో ఆర్.డి.ఎక్స్ లవ్ చేసినప్పటికి అందరు ఆ సినిమాని చ.. చ.. అన్నారు. అయితే వెంకీమామ కాస్త పాయల్ కి ఊరటనిచ్చింది. ఇక తాజాగా పాయల్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. పాయల్ రాజ్‌పుత్ ఐపీఎస్ అధికారిణిగా నటించిన ఈ చిత్రానికి ‘5ws’ అనే టైటిల్‌ను పెట్టారు. 

 

గుణశేఖర్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ కిశోర్ ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో భాగంగా పాయల్ రాజ్‌పుత్ ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నాకు, నా కెరియర్‌కి కంప్లీట్‌గా కొత్త సినిమా ఇది. పోలీస్, ఐపీఎస్ రోల్ చేయాలని ప్రతి యాక్టర్ కలలు కంటారు. ఇప్పుడు అలాంటి గోల్డెన్ ఛాన్స్ నాకు దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. 

 

ఇక పాయల్ రాజ్‌పుత్ ఈ పాత్ర చేయడానికి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి స్ఫూర్తి అని వెల్లడించింది. దర్శకుడు ప్రణదీప్ నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఈ పాత్ర చేయడానికి నాకు విజయశాంతి గారు స్ఫూర్తి. ఆమె నటించిన చాలా సినిమాలు చూశాను. ఆవిడ పోలీస్ పాత్రలు చాలా చేశారు. ఈ ‘5ws’లో కొత్తగా చేసే అవకాశం నాకు లభించింది... అని పాయల్ తెలిపింది. మొత్తానికి పాయల్ విజయశాంతి ని స్పూర్తిగా తీసుకోవడం బావుంది. అలాగే మంచి హిట్ పడితే బావుంటుంది. యూ టర్న్ అదిరింది పాయల్ .. ఇదే మీటర్ కంటిన్యూ చేస్తే సక్సస్ లు దక్కే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: