టాలీవుడ్‌లో మెరిసిన తారజువ్వా చిరంజీవి.. ఈయన పేరువింటే చాలు.. అభిమానుల గుండెల్లో తెలియని ఆనందం వికసిస్తుంది.. తాను పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు కూడా ఊహించలేదేమో తన కొడుకు వెండితెరను ఏలే బంగారం అవుతాడని.. ఎక్కడి కొణిదెల శివశంకర వరప్రసాద్.. ఇప్పుడు చూస్తున్న చిరంజీవి.. ఎంత మార్పు.. పేరులోనే కాదు.. స్దాయిలోను అందుకోలేనంత శిఖరంలో నిలిచాడు.. తన శ్రమతో, పట్టుదలతో భారతీయ చిత్ర పరిశ్రమలో అనితర సాధ్యమైన గుర్తింపు తన సొంతం చేసుకున్నాడు..

 

 

ఒక్క సారి ఆయన జీవితంలోకి తొంగి చూస్తే బిరుదులు, అవార్డులు, ఆస్తులు, అంతస్తులు, లెక్కలేనన్ని సినిమాలు ఇంకా అభిమానులు ఇలా ఎన్నో గుర్తొస్తాయి. ఈ స్థానాన్ని చేరుకోవడాని ఆయన గడిపిన చీకటి రాత్రులు, ప్రయాసలు ఈ తరానికి అంత సులభంగా అంతుచిక్కకపోవచ్చు. కానీ.. నాటి చరిత్ర తిరగేస్తే ఆయన సుదీర్ఘ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఓ చక్కటి పాఠమే అవుతుంది... ఇక చిరంజీవి నటనగురించి తెలిసిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తన బాల్యాన్ని నెల్లూరులో గడిపే సమయంలో వాళ్ల పక్కింట్లో ఉన్నావిడ వీరి ఇంటికి వచ్చి "వదినా... కాస్త పాలలోకి తోడు ఇస్తారా..?" అనడాన్ని పదేపదే అనుకరించడం ద్వారా అతని నటన ఆరంభమయ్యిందట..

 

 

అలా ఆ బాల్యం దాటుకొని భవిష్యత్తు ఏంటో ఎంచుకునే వయస్సులో ఉన్నపుడు నటన మీద మక్కువతో ఇంట్లో ఒప్పుకోరని తెలిసి ఎవ్వరికీ చెప్పకుండా మద్రాసు వెళ్లిపోయి అడయార్ ఫిల్మ్ ఇన్‌స్ట్యూట్‌లో చేరి పలు రకాల కోర్సులు, నటనా నైపుణ్యాలను వంటబట్టించుకుని అవకాశాల కోసం  డైరక్టర్ల చుట్టూ తిరగడంతో చిరంజీవి గారి సినీ ప్రయాణం ప్రారంభమయ్యిందట.

 

 

అయితే చిరంజీవి ప్రయత్నాల్లో అడుగడుగున అడ్దంకులే ఎదురవగా, వాటన్నీంటిని దాటుకుంటూ, తాను చేరవలసిన గమ్యం కంటికి కనిపించనంత దూరంలో ఉన్న ఆ కాలంలోనే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి "పునాది రాళ్లు" సినిమాతో బలమైన పునాది వేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి..

 

 

ఇక  ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే చిరంజీవి చిన్నతనంలో అన్నప్రాసన జరిగినప్పుడు కత్తి పట్టుకొని ఆశ్చర్యపరిచాడని, అప్పుడు పట్టుకున్న కత్తి ‘ఖైదీ నెంబర్ 150’ వరకూ వదల్లేదని అంజనాదేవి ఒక సందర్భంలో అన్నారు.. మరి చిన్నప్పుడు కత్తిని పట్టిన ఈ శివప్రసాద్ ఇప్పుడు మాత్రం ఎనలేని కీర్తి ప్రతిష్టలను సమకూర్చుకున్నాడు... 

మరింత సమాచారం తెలుసుకోండి: