టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో అయితే అదిరిపోయే పాపులారిటీ సంపాదించారు. సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ రౌడీ బాయ్ కి మంచి క్రేజ్ ఉంది. చాలా తెలివిగా తన మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించుకుంటూనాడు విజయ్ దేవరకొండ. మనోడు పేరు చెబితే లేకపోతే ఏదైనా కంపెనీకి అంబాసిడర్ గా వ్యవహరిస్తే సదరు కంపెనీకి మంచి బిజినెస్ జరుగుతుంది. అంత పవర్ ఉంది మనోడు పేరుకి.

 

ఇటువంటి నేపథ్యంలో ఇటీవల కొంతమంది సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరును ఉపయోగించుకుని అమ్మాయిలను వాడిపోవడం మరియు డబ్బులు గుంజడం వంటివి చేస్తున్నారట. ఇలాంటివి రెండు మూడు ఘటనలు తన వద్దకు రావడంతో షాక్ అయిపోయిన విజయ్ దేవరకొండ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ నాశ్రయించి జరిగిన ఘటనలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతుంది. తన పేరును వాడుకొని పాపులారిటీని సంపాదించుకున్న వారిని శిక్షించాలంటూ విజయ్ దేవరకొండ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు అని వార్తలు వస్తున్నాయి.

 

 

తన పేరును ఉపయోగించుకుని సమాజంలో అసభ్యంగా అమ్మాయిలతో ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారట. అంతేకాకుండా వాట్సప్‌ లో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ అంటూ ఒక గ్రూప్‌ ను క్రియేట్‌ చేసి విజయ్‌ దేవరకొండను కలిపిస్తామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారట. దీంతో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూచనల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పేరుతో ఎలాంటి ప్రకటనలు మరియు సోషల్ మీడియా లో మెసేజీలు వచ్చిన వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా పోలీసులు కోరారు.

 

ఒక్క విజయ్ దేవరకొండ పేరు మాత్రమే కాదు సెలబ్రిటీల పేర్లతో సోషల్ మీడియాలో నెటిజన్లు మోసపోవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో నటించే అవకాశం వచ్చినట్లు వచ్చే ప్రకటనలను అస్సలు నమ్మవద్దని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. దీంతో కొంతమంది సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్...మనోడు పి‌ఆర్ లే చూసుకోవాలి మరి మాకు వేరే పనులు ఉండవు అంటూ ఎటకారం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: