సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మద్య వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు.  లింగ మూవీ తర్వాత ఆయన నటిస్తున్న సినిమాలు వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి. గత ఏడాది పెట్టా కాస్త పరవాలేదు అనిపించుకుది.  ఈ మద్య మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్భార్ హిట్ అయ్యింది..  కానీ పైసా వసూల్ చేయలేక పోయింది.  దాంతో బయ్యర్లు పెద్ద గొడవనే చేశారు.  మొత్తానికి ఈ సమస్యను రజినీ దగ్గర ఉండి సెటిల్ చేసినట్లు కోలీవుడ్ టాక్.  ఇదిలా ఉంటే గత కొంత కాలంగా రజినీకాంత్ పార్టీ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 

 

ఆయన స్నేహితుడు కమల్ హాసన్ ఇప్పటికే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.  సినీ నటులు పార్టీలు స్థాపించడం కామన్ అయ్యింది.  పొలిటికల్ పార్టీ ఏర్పాటు పై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అన్ని కుదిరితే డిసెంబరు 12 న ప్రకటన రావచ్చు. వచ్చే ఏడాదే రాజకీయ పార్టీ ప్రారంభం కావచ్చు.  ఈ మాటలు ఆయన సన్నిహితుడు రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్ కమల్ చెప్పిన మాటలు..కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రజనీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో గురువారం భేటీ అయ్యారు.

 

ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. .. చాలా విషయాలు తమ మధ్య చర్చకు వచ్చాయని చెప్పారు.  అయితే సమయం వచ్చినపుడు  అన్నీ బయటపెడతానని అన్నారు.  గతంలో రజినీ డైలాగ్.. దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అన్నట్టు ఇప్పుడు కూడా అదే డైలాగ్ తో సరిపెెట్టారు. ఇటీవల తనతో ముస్లిం నాయకుల భేటీ గురించి ప్రస్తావిస్తూ సీఏఏకి వ్యతిరేకంగా మద్దతు తెలపాలని వారు కోరినట్లు చెప్పారు రజనీకాంత్. హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చించి.. అనుమానాలను నివృత్తి చేసుకోవలసిందిగా వారికి సూచించానన్నారు. ఏది ఏమైనా పార్టీ పెట్టే యోచనలోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: