చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి మేకర్స్ అవకాశాలివ్వరని చాలామంది అమ్మాయిలు వాపోతుంటారు. బాగా ఆలోచిస్తే అది నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు మన తెలుగులో ఉన్న హీరోయిన్స్ చూస్తే అందరు ముంబై లేదా ఢిల్లీ నుండి తెచ్చుకుంటున్నారు. వాళ్ళకే అవకాశాలు వాళ్ళకే స్టార్ హీరోయిన్స్ గా స్టేటస్ ని కట్టబెడుతున్నారు. అంతేకాదు ఒకరకంగా ఇప్పుడున్న నార్త్ ఇండియన్ హీరోయిన్స్ ఇక్కడ వచ్చి ఏలుతున్నారంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంటే అది మన తెలుగు మేకర్స్ ఇచ్చిందే. అదే మన తెలుగమ్మాయిలకి ఎందుకివ్వరో అర్థం కావడం లేదు.

 

కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి ఐశ్వర్య రాజేశ్. తెలుగమ్మాయే అయినా కోలీవుడ్ లో తమిళ సినిమాలు చేస్తూ బాగా పాపులరైంది. దాంతో టాలీవుడ్ లోనూ ఎదగాలని ప్రయత్నించినప్పటికి ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. క్రీడా నేపథ్యం గ్లామర్ షోకు ఆస్కారం లేకుండా చేసిన కౌశల్య సత్యమూర్తి ఫ్లాపైంది. అయినప్పటికి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో మాత్రం విజయ్ దేవరకొండ కు భార్య గా పోషించిన పాత్రపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా డిజాస్టర్ అయింది.

 

దాంతో ఇక తెలుగులో ఛాన్సులేవీ రాలేదు. అదే ముంబై హీరోయిన్స్ అయితే ఇంకో ఫ్లాప్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ అవకాశలిస్తూ ఎంకరేజ్ చేస్తారు. అదే తెలుగమ్మాయి అయ్యోసరికి ఐశ్వర్య రాజేశ్ ని మన మేకర్స్ పట్టించుకోవడం లేదు. అదే ఇప్పుడు ఐశ్వర్య రాజేశ్ ఫీలవుతుందట. మరోసారి ఛాన్స్ ఇస్తే నన్ను నేను నిరూపించుకుంటానని అంటోందట. కానీ ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చే నాధుడు ఎవరు. అందులోను ఐశ్వర్య రాజేశ్ ఎక్స్‌ఫోజింగ్ చేయలేదు. గ్లామర్ రోల్స్ కి కాస్త దూరంగా ఉంటుంది. కాని మన వాళ్ళకి కావాల్సిందే ఆ రెండే కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఐశ్వర్య రాజేశ్ కి అవకాశాలిచ్చేది ఎవరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: