కొన్ని సందర్భాలలో స్టార్ హీరోల కంటే కూడా హీరోయిన్సే ముందుంటారు... సపోర్ట్ చేస్తారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇగోలు ఉండటం సహజం. అందులో కొంతమంది హీరో, హీరోయిన్స్ మధ్య అలాగే సహ నటుల మధ్య బాగా ఇగో సమస్యలు తలెత్తుతుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్క హీరోయిన్స్ మాత్రం అలాంటి ఇగోకి వెళ్ళకుండా తన తోటి నటుడికోసం సహాయం చేయబోతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్ సినిమా 'అంగ్రేజీ మీడియం'. 

 

ఈ సినిమాకు ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఇర్ఫాన్ ఖాన్ ప్రాణాంతకమైన జబ్బుతో బాధ పడుతున్నారు. క్యాన్సర్ నుండి బయట పడ్డ ఆయన అంగ్రేజీ మీడియం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే ఇర్ఫాన్ అనారోగ్యానికి గురయ్యారు. మొత్తానికి పూర్తిగా కోలుకొని సినిమాని కంప్లీట్ చేశాడు. 

 

సినిమా విడుదల సందర్బం గా ప్రమోషన్ లో పాల్గొనలేకపోతున్నాడు. అయితే ప్రస్తుతం యూకేలో చికిత్స పొందుతున్న ఇర్ఫాన్ కోసం ఏకంగా ఏడుగురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇర్ఫాన్ ఖాన్ తరపున సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాలోని ఒక సాంగ్ కి డాన్స్ చేసి ప్రమోషన్స్ ని హీటెక్కిస్తున్నారు. నిజంగా ఇది గొప్పగా చెప్పాల్సిన విషయం. ఒక నటుడి కోసం ఇలా ఏడు మంది స్టార్ హీరోయిన్ వచ్చి సినిమాని ప్రమోట్ చేయడం అంటే మాటలు కాదు. వాళ్ళ సినిమాలు, ఇతర షెడ్యూల్స్ కూడా పక్కన పెట్టి ఇలా ముందుకు వచ్చారంటే ఇర్ఫాన్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న అభిమానం ఏంటో తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి 'కుడి ను నాచ్నే దే డాన్స్' అన్న సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. అందుకే సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కత్రీనా కైఫ్.. అనుష్క శర్మ.. ఆలియా భట్.. జాన్వీ కపూర్.. కృతి సనన్.. అనన్య పాండే.. కియారా అద్వానీ 'కుడి ను నాచ్నే దే డాన్స్' కు డాన్స్ చేశారు. సినిమాకు ఇప్పటికే మంచి పబ్లిసిటీ పీక్స్ లో ఉంది. ఈ ఏడుగురు డాన్స్ వీడియో ను బిగ్ బి అమితాబ్ రిలీజ్ చేయడం బాలీవుడ్ లో సెన్షేషనల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: