టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరొక హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్, దీని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అయితే తన సినిమాల తో పాటు, తనకు వీలు దొరికిన సమయంలో ఇతర నటీనటుల సినిమాలకు సంబంధించి, వారి టాలెంట్ ని కూడా మెచ్చుకుని ఎంకరేజ్ చేసే అలవాటున్న ఎన్టీఆర్

 

అతి త్వరలో రిలీజ్ కానున్న చిన్న సినిమా ఓ పిట్ట కథ సినిమా యూనిట్ కు, అలానే ఆ సినిమాలో నటిస్తున్న సీనియర్ యాక్టర్ బ్రహ్మాజితో పాటు ఆయన తనయుడు సంజయ్ కు బెస్ట్ విషెస్ తెలుపుతూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేసారు. ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన చేతులమీదుగా రిలీజ్ చేయగా, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా అధికారిక ఫస్ట్ లుక్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపి, 

 

తప్పకుండా ఈ సినిమాతో బ్రాహ్మజీ కుమారుడికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మధ్యలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ పిట్ట కథ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టీమ్ కు స్పెషల్ గా విషెస్ తెలిపారు. సో, ఈ విధంగా టాలీవుడ్ లోని దాదాపుగా బడా స్టార్స్ అందరూ కూడా బ్రహ్మాజీ కుమారుడి డెబ్యూ మూవీ అయిన ఓ పిట్ట కథ సక్సెస్ కావాలని కోరుకుంటూ తమవంతుగా సాయం అందించారన్న మాట. ఒక డిఫరెంట్ పాయింట్ తో పలు రకాల థ్రిల్లింగ్, ఎంటర్టైన్మెంట్ అంశాలు జోడించి తెరకెక్కించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: