స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్ని సినిమాల ప్రమోషన్స్ విషయంలో అతిగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అది ఆయనకే షాకిస్తుంది. వాస్తవంగా దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా దిల్ రాజు చిన్న చిన్న బడ్జెట్ కథలను ఎంచుకోవడం.. వాటికీ పెద్దగా ప్రమోషన్స్ చెయ్యకుండా బడ్జెట్ ని మిగుల్చుకోవడంతో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. ఈ విషయంలో జనాలు దిల్ రాజుని బాగా ఏకిపారేస్తున్నారు. కోలీవుడ్ 96 రీ మేక్ జాను సినిమా 10 నుండి 15 కోట్ల వరకు నష్టాలని తెచ్చింది. 

 

తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ విషయంలో కూడా ఇలానే ప్రవర్తిస్తున్నాడట. పవన్ తో సినిమా చేస్తున్నా.. పవన్ కి 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నాను.. పవన్ కోసం ఫ్లైట్ ఎరేంజ్ చేశా అంటూ గొప్పలు మాత్రం బాగానే చెప్పుకుంటున్నాడు. కానీ సినిమా ప్రమోషన్స్ విషయానికొచ్చేసరికి మాత్రం లైట్ గా తీసుకుంటూ పవన్ కళ్యాణ్  క్రేజ్ ని అడ్డం పెట్టుకొని లాభాలు పొందాలని చీప్ గా ఆలోచిస్తున్నాడట. 

 

పవన్ పింక్ రీమేక్ టైటిల్‌తో పాటుగా పవన్ లుక్‌ని హంగామా లేకుండా రివీల్ చేసిన దిల్ రాజు మళ్ళి కామ్ గా సైలెంట్ ఉన్నాడు. రెండు రోజుల క్రితం పవన్ పింక్ రీమేక్ లుక్ అంటూ పోస్ట్ పెట్టడం.. సోమవారం సాయంత్రం పవన్ పింక్ రీమేక్ టైటిల్ వకీల్ సాబ్ అంటూ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లుక్ ని రిలీజ్ చేశారు దిల్ రాజు. పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామాలో పదవ వంతు కూడా హడావుడి చేయలేదు దిల్ రాజు. రెండేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్, పబ్లిసిటీ అంతగా అవసరం లేదని అనుకుంటున్నాడట. అయితే ఇది తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదేమన్నా రాజ్ తరుణ్ సినిమా అనుకుంటున్నారా .. ఈ విషయం మా పవర్ స్టార్ కి తెలిస్తే ఇంకేమైనా ఉమదా అంటూ కామెంట్స్ చేస్తున్నారట. నిజమే కదా ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: