స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన గంగోత్రి సినిమాతో గ్రాండ్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు ఈ అల్లు వారసుడు. అయితే హీరోగా అల్లు అర్జున్ కి ఈ సినిమా మొదటి సినిమా. కానీ అల్లు అర్జున్ సినిమా ఎంట్రీ గంగోత్రి కి ముందే జరిగింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.  

 

అల్లు అర్జున్ మావయ్య మెగాస్టార్ చిరంజీవి, సిమ్రన్ జంటగా నటించిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ మొదటిసారిగా కనిపించాడు. చిరంజీవి సోలో సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ చేసి అలరించాడు. ఇది చూసిన దర్శకేంద్రుడు తన చేతులతో అల్లు అర్జున్ ని పరిచయం చేస్తానని అల్లు అరవింద్ గారి దగ్గర మాట తీసుకున్నారట. అన్నట్టుగానే గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు దర్శకేంద్రుడు. అంతేకాదు అల్లు అర్జున్ హీరోగా నిలబెట్టారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టార్ అవడం ఖాయమని ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ ని ఆశీర్వదించారు.

 

అలానే అల్లు అర్జున్ ఈరోజు స్టార్ హీరోగా ఎదిగాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారంటే దాని వెనక అల్లు అర్జున్ ఎంతగా కృషి చేశాడో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ తండ్రి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్. అలాగే మావయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనక ఉన్నా గాని అల్లు అర్జున్ సొంతగా ఎదగడానికే ఎక్కువగా ప్రయత్నాలు చేశాడు. అలానే స్టార్ గా నిలబడ్డాడు. ఈ రోజు అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బన్నీ కోసం ఫ్యాన్స్ పడే ఆరాటం మామూలుగా ఉండదు. అయితే ఇది బన్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఎలాంటి ఫంక్షనైనా ముందు తన ఫ్యాన్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ముందుగా ఫ్యాన్స్ ని ఉద్దేశించే మాట్లాడతాడు. ఆ తర్వాతే తన సినిమా గురించి మాట్లడతాడు. అంతేకాదు ప్రతీసారి మీరు లేకపోతే మేము లేము. మీరి ఇచ్చిన ఈ సక్సస్ లే మమ్మలిని స్టార్స్ గా ఎదిగేలా చేశాయని గర్వంగా చెప్పడం అల్లు అర్జున్ కే సాధ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: