టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతకు ముందు పలు సినిమాల్లో బాలనటుడిగా నటించిన మహేష్, చిన్నతనంలోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక తన హీరో కెరీర్ పరంగా కొన్ని అపజయాలతో పాటు, ఎన్నో అద్భుత విజయాలు కూడా అందుకున్న సూపర్ స్టార్, తన సినిమా కెరీర్ మొత్తంలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే రెండు లేక మూడు సార్లు రిపీట్ చేయడం జరిగింది. ఇక ఆ విధంగా తన కెరీర్ మొత్తంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించారు సూపర్ స్టార్. 

 

మొదటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు సినిమాలో సమంతతో కలిసి నటించిన మహేష్ బాబు, ఆ సినిమాతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నారు. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరొక నటుడు వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో రెండోసారి సమంతతో జోడీ కట్టారు మహేష్. రిలీజ్ తర్వాత ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత మరొక్కసారి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా ఆయనకు జోడీగా సమంత నటించింది. 

 

అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీసు దగ్గర సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ మూడు సినిమాల జయాపజయాలు విషయం పక్కన పెడితే, మహేష్ బాబు సమంతల జోడీ స్క్రీన్ పై ఎంతో అదిరిపోతుంది అనే చెప్పాలి. ఇక వివాహం తర్వాత ఇటీవల సమంత కూడా ఎంతో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ ఉండటంతో, ఇకపై రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం తక్కువే అని చెప్పాలి. అయితే అభిమానులు మాత్రం మరొక్కసారి వీరిద్దరి కాంబోలో మరొక సినిమాని ఆశిస్తున్నారు. మరి వారి ఆశ రాబోయే రోజుల్లో ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: