టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి సూపర్ డూపర్ హిట్స్ తో ఎనలేని క్రేజ్ సంపాదించి ముందుకు దూసుకెళ్లారు. ఆ తర్వాత కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాలో నటించిన ఎన్టీఆర్, ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో నటించిన సినిమాల్లో ఆయన కూడా ఒకే హీరోయిన్ ను ఎక్కువ సార్లు రిపీట్ చేయలేదు. 

 

అయితే తన కెరీర్లో నటించిన అశోక్, నరసింహుడు సినిమాలలో ఎన్టీఆర్ పక్కన నటించి మంచి జోడీ గా పేరు సంపాదించింది సమీరా రెడ్డి. తన ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు నాట్యంలో కూడా ఎంతో ప్రావీణ్యత గల సమీరారెడ్డి, ఎన్టీఆర్ తో పోటాపోటీగా ఆయన నటించిన సినిమాల్లో డాన్సులు అదరగొట్టింది. ముందుగా వీరిద్దరి కాంబోలో వచ్చిన అశోక్ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, వీరిద్దరి పేరుకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. 

 

ఆ తర్వాత వీరిద్దరూ మరొకసారి కలిసి నటించిన నరసింహుడు సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినప్పటికీ, ఈ జోడి స్క్రీన్ పై అదరగొట్టడంతో మంచి పేరు దక్కింది. అయితే ఆ తర్వాత ఒకానొక సినిమాలో కూడా సమీరాకు ఎన్టీఆర్ సరసన అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల అది మిస్ అయినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత వివాహానంతరం సినిమాలకు దూరమయ్యారు సమీరా. అయినప్పటికీ కూడా యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ సమీరాల జోడీపై ఇప్పటికీ కూడా మంచి క్రేజ్ నెలకొని ఉంది. మరోవైపు వరుసగా అవకాశాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: