‘తెలుగు సినిమాను చిరంజీవి రాక ముందు.. చిరంజీవి వచ్చాక అంటూ చెప్పుకోవాల్సిందే..’ అని ఇటివల పరిశ్రమ పెద్దల్లో ఒకరైన మురళీమోహన్ అన్న మాట అక్షరాలా నిజం. డ్యాన్సుల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన చిరంజీవే బ్రేక్ డ్యాన్సులను కూడా పరిచయం చేసి తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారు. పసివాడి ప్రాణం సినిమాలో తొలిసారి బ్రేక్ డ్యాన్స్ వేసిన చిరంజీవికి జోడీగా విజయశాంతి నటించింది. ‘చక్కని చుక్కల సందిట బ్రేడ్ డ్యాన్స్’ అంటూ వీరిద్దరూ చేసిన బ్రేక్ డ్యాన్స్ మాయాజాలానికి తెలుగు రాష్ట్రం ఫిదా అయిపోయింది.

 

 

చిరంజీవివిజయశాంతి కాంబినేషన్లో మొత్తం 18 సినిమాలు వచ్చాయి. ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు వీరిద్దరి కాంబినేషన్లో ఉన్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్.. సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. స్వయంకృషి, యుధ్దభూమి.. వంటి చాలా హిట్లున్నాయి. విజయశాంతి తన కెరీర్ మొత్తంలో చిరంజీవితో చేసినన్ని సినిమాలు మరే హీరోతో చేయకపోవడం విశేషం. పసివాడి ప్రాణంలో బ్రేక్ డ్యాన్స్ తో, కొండవీటిదొంగలో ‘చమక్ చామ్’ పాటలో స్లో డ్యాన్సులతో చిరంజీవి డ్యాన్సుల్లో ఓ ప్రభంజనమే సృష్టించారు. ఈ రెండు పాటలు కూడా వీరిద్దరి కాంబినేషన్ లోనే రావడం విశేషం.

 

 

కొండవీటి రాజా, యముడికి మొగుడు సినిమాల్లో ఫోక్ సాంగ్స్, గ్యాంగ్ లీడర్ పాటలు కూడా వీరి కాంబోలో స్పెషల్ సాంగ్స్ గా నిలిచాయి. చిరంజీవి–విజయశాంతి కాంబినేషన్ చూసేందుకు ఎంతో అందంగా ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరు సినిమా 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు. చాలా ఏళ్ల తర్వాత ఇటివల కలిసిన ఈ జంట చూడముచ్చటగా ఉండి తమదెంత హిట్ పెయిరో నిరూపించారు. అభిమానులు, ప్రేక్షకులతో సహా వీరిద్దరూ గత జ్ఞాపకాలను తలచుకుని ఆనందంలో మునిగిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: