టాలీవుడ్ లో ఇంకా పెళ్లి కాని హీరోయిన్ ఎవరు అంటే ముందు వినిపించే పేరు స్వీటీ అనుష్కదే.. పెళ్లి కాని అనుష్కని మీడియా మాత్రం చాలాసార్లు చాలామందితో పెళ్లి వార్తలు రాసేసింది. నాగ చైతన్య, ప్రభాస్ ఇలా తనతో చేసిన హీరోలతోనే కాదు చేయని హీరోలతో కూడా ఎఫైర్ ఉందని వార్తలు రాశారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా అనుష్కని కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ పెళ్లి చేసుకుంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అతనితో సైజ్ జీరో సినిమా చేసింది అనుష్క.

 

ప్రకాష్ కూడా తన భార్య కనిక ధిల్లాన్ తో విడాకులు తీసుకుని ఉన్నాడు. అనుష్కతో పెళ్లి కోసమే ఇదంతా చేశాడని వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా అయితే ప్రకాష్ తోనే అనుష్క పెళ్ళంటూ గట్టిగా చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుగు మీడియాకు మాత్రం లీక్ చేయలేదు. ప్రకాష్ డైరక్టర్ గా కూడా పెద్దగా సక్సెస్ అవలేదు. తెలుగులో సైజ్ జీరో తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు. అయితే బాలీవుడ్ లో ప్రకాష్ టాలెంట్ చూపిస్తున్నాడు. తను రీసెంట్ గా చేసిన జడ్జిమెంటల్ హై క్యా సినిమా చేశాడు.

 

ఇన్నాళ్ళు ప్రభాస్ తో అనుష్కకు లింక్ పెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఏదో ఒక న్యూస్ రాసేవారు. అయితే ఇప్పుడు అనుష్క పెళ్లి రేసు నుండి ప్రభాస్ ను తప్పించి ప్రకాష్ ను యాడ్ చేశారు. ఆ రొమాంటిక్ డైరక్టర్ నే అనుష్కని వరించే వరుడని అంటున్నారు. అయితే మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఎవరు ఖండించడం కూడా జరగట్లేదు.. అందుకే ఈ వార్తలు నిజం అని నమ్మేలా ఉన్నాయి. అనుష్క పెళ్లి చేసుకునేంత వరకు ఈ రూమర్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం అనుష్క చేసిన నిశ్శబ్దం రిలీజ్ కు రెడీగా ఉంది. ఏప్రిల్ 2 న ఆ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: