సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ లెగసీకి మరీనా గౌరవం తెస్తున్నాడు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినా హీరోగా రాజకుమారుడు నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తన సత్తా చాటుతూ ఉన్నాడు. తన పాతిక సినిమాల అనుభవంలో పాతిక మండి హీరోయిన్స్ తో పనిచేసిన మహేష్ తనకు ఎప్పటికి బెస్ట్ హీరోయిన్ అంటే ఒక్కరే.. ఆమె తన భార్య నమ్రతా అనేస్తాడు మహేష్. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు ఇంటర్వ్యూస్ లో కూడా మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అంటే బాగా నమ్రతా అందుకే తననే పెళ్లి చేసుకున్నా అన్నాడు.

 

మహేష్ తో నమ్రత కలిసి నటించిన సినిమా వంశీ. ఆ సినిమాతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత మహేష్ ఇమేజ్ మారిపోయింది. అప్పటివరకు ప్రిన్స్ గా ఉన్న మహేష్ ఆ తర్వాత సూపర్ స్టార్ గా మారాడు. మహేష్ చేస్తున్న ప్రతి సినిమా విషయంలో నమ్రత సపోర్ట్ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి అన్యోన్యత అందరికి ఆదర్శమని చెప్పొచ్చు.

 

ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో హాలీడేస్ కు వెళ్లడం మాత్రం మిస్ చేయడు మహేష్. సినిమా సినిమాకు మధ్యలో వచ్చే గ్యాప్ ను ఫ్యామిలీతో సంతోషంగా ఎంజాయ్ చేస్తాడు. మహేష్ జీవితంలో నమ్రత వచ్చింది కాబట్టే అతని లైఫ్ ఇంట అందంగా ఉందని చెప్పొచ్చు. మిస్ ఇండియా అయినా ఒక ఇంటి గృహిణిగా సూపర్ స్టార్ భార్యగా నమ్రతా మహేష్, మహేష్ ల జోడీ ఎప్పటికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అయితే వీరిద్దరూ వంశీ తర్వాత కలిసి నటించింది లేదు. అభిమానులు మాత్రం మళ్ళీ వీరిని తెరపై చూడాలని అనుకుంటున్నారు. మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: