తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏడేళ్లుగా జబర్ధస్త్ ని డామినేట్ చేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాయి.. కానీ ఏది కూడా సక్సెస్ సాధించలేక పోయాయి. జబర్ధస్త్ లో పాపులర్ అయిన నటులు వేణు, తాగుబోతు రమేష్, దన్ రాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర వీరే కాదు మరికొంత మంది వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. షకలక శంకర్, సుధీర్ లు హీరోలుగా నటించారు. అయితే జబర్ధస్త్ తో మంచి హిట్ సాధించిన వారు ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు.
ఇలా జబర్ధస్త్ పుణ్యమా అని మంచి సెటిల్ మెంట్ అయిన వారు ఇప్పుడు ఇతర ఛానల్స్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇక యాంకర్లు అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అనసూయ, రేష్మి ఇతర ఛాన్సులు దక్కించుకుంటూ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సుడిగాలి సుధీర్, ఆది, శ్రీను, ఆటో రాం ప్రసాద్, అప్పారావు, అవినాష్ లాంటి పలువురు కమెడియన్లు మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే జబర్ధస్త్ లో హైపర్ ఆది స్కిట్ అంటే ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. ఆది వేసే పంచులు కడుపుబ్బా నవ్విస్తున్నారు. హైపర్ ఆది,రైజింగ్ రాజు తో పాటు దొరబాబు, పరదేశిలు కూడా ఉంటారు. మొన్న వైజాగ్ లో దొరబాబు, పరదేశి లు వ్యభిచారం చేస్తుండగా అడ్డంగా బుక్ అయ్యారు.
ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. సెలబ్రెటీ హోదాలో ఉండి ఇంత నీచమైన పనులు చేయడంతో అందరూ ఛీ కొడుతున్నారు. ఇప్పుడు దొరబాబు చేసిన పనికి.. మిగిలిన కమెడియన్లందరికీ మల్లెమాల ప్రొడక్షన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి పిచ్చి కథలు పడితే.. జబర్దస్త్ నుంచి తొలగిస్తామని.. హైకమాండ్ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఇక దొరబాబు జబర్దస్త్‌లోకి రాక ముందు యూ ట్యూబ్‌లో ‘బిగ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్’ కూడా చేశాడు.