టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు పదుల వయస్సు దాటి పోతున్న కుర్ర హీరోలకు కూడా లేని ఫిట్నెస్ తో  ఇప్పటికీ అమ్మాయిల మనుసులు  కొల్లగొడుతూ ఉంటాడు టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున. తెలుగు చిత్ర పరిశ్రమ నటసామ్రాట్ ఆయన అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఎంతో క్రేజ్ సంపాదించారు. ఇప్పటివరకు నాగార్జున ఎన్నో సినిమాల్లో నటించారు... ఇక నాగార్జున ఇప్పుడు వరకు ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు. కానీ నాగార్జున ఎంతమంది హీరోయిన్లతో నటించిన నాగార్జున సరసన ఒక హీరోయిన్ మాత్రం ప్రేక్షకులకు ఇప్పుడు ఫేవరెట్ గానే ఉంటుంది. 

 

 

 నాగార్జున పక్కన ఆ హీరోయిన్ కనిపిస్తే చాలు ఈలలు గోలలో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతోంది. నాగార్జున సరసన ఆ హీరోయిన్ కి అంత క్రేజ్ ఉంది మరి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అంటారా... టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు తన హవా నడిపించిన అనుష్క. అనుష్క శెట్టిని  అందరూ స్వీటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అనుష్క ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది నాగార్జునే. నాగార్జున హీరోగా నటించిన చిత్రం సూపర్. ఈ సినిమాలు సోను సూద్ చెల్లెలుగా  అనుష్క నటించింది. ఇక నాగార్జున అనుష్క మధ్య ఈ సినిమాలో కాస్త రొమాన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క నాగార్జున సరసన పలు సినిమాల్లో నటించింది. 

 

 

 నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ డాన్ సినిమాలో కూడా అనుష్క నటించింది. ఈ  సినిమాలో కూడా నాగార్జున అనుష్క మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక మరో సారి నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించింది అనుష్క. ఇలా వరుస సినిమాల్లో నటించడం తో ప్రేక్షకులకు ఈ జంట ఫేవరేట్ గా మారిపోయింది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై ఈ జంట కనిపిస్తే చాలు.. ఇక అభిమానులందరిలో  హుషారు నిండి పోతూ ఉంటుంది. అందుకే నాగార్జున పక్కన ఎంత మంది హీరోయిన్లు నటించిన అనుష్క మాత్రం ఎప్పుడూ స్పెషల్.

మరింత సమాచారం తెలుసుకోండి: