ప్రస్తుతం వరస పరాజయాలతో సతమతమైపోతున్న విజయ్ దేవరకొండ కు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫలితం అత్యంత కీలకంగా మారింది. దీనికితోడు ఈ మూవీ ఫలితం పూరీకి కూడ చాల కీలకం కాబట్టి ఈ మూవీని పూరి తన పద్ధతికి భిన్నంగా చాల నెమ్మదిగా తీస్తున్నాడు. 


దీనితో ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే వరుణ్ తేజ్ తన కెరియర్ కు సంబంధించి 10వ మూవీగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ అనుకోని విధంగా విజయ్ కు చెక్ పెట్టి లా మారిందా అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తున్నాయి. 


వరుణ్ తేజ్ తన లేటెస్ట్ మూవీలో బాక్సర్ గా నటిస్తున్నాడు. దీనికోసం విదేశాలకు వెళ్ళి శిక్షణ కూడ తీసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వైజాగ్ ప్రాంతంలో మొదలై వేగంగా నడుస్తోంది. ఈ మూవీ కథ పూరి విజయ్మూవీ కథ కొన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది అన్న సందేహాలు ఏర్పడటంతో ఇప్పుడు వరుణ్ తేజ్ తన మూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి విజయ్ సినిమా కన్నా ముందుగా విడుదల చేసే ఆలోచనలలో ఉన్నట్లు టాక్.


దీనితో ఈ ఊహించని పరిణామానికి విజయ్ తో పాటు పూరి కూడ షాక్ అయినట్లు సమాచారం ఇప్పటికే ఫెయిల్యూర్ లు వెంటాడుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఇలా అనుకోని సమస్యలు వరుణ్ తేజ్ రూపంలో రావడం ఏమిటి అంటూ ఆలోచనలు చేస్తూ దీనికి పరిష్కారాలు వెతికే మార్గంలో పూరి విజయ్ లు ఉన్నట్లు టాక్. అయితే విజయ్ దేవరకొండ మూవీని పాన్ ఇండియా మూవీగా తీస్తున్న పూరి ఇప్పుడు హడావిడి పడినా ప్రయోజనం లేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: