ఈ తరం టాలీవుడ్ హిట్ పెయిర్స్ లో ప్రధానంగా వినపడే పేర్లు అనుష్క, ప్రభాస్... వీరి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క బిల్లా సినిమా మినహా... ఆ సినిమాలో వీరి రోమాన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. వీళ్ళు ఇద్దరూ కలిసి నటిస్తున్నారు అంటే ప్రేక్షకులకు ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ఈ జోడి రోమాన్స్ కి ప్రత్యేక స్థానం ఉంది. బిల్లా సినిమా ఫ్లాప్ అయినా సరే వీరి కాంబినేషన్ మాత్రం హిట్ అయింది అనే చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి మిర్చి సినిమాలో నటించారు. 

 

ఆ సినిమాలో బావా మరదళ్ళు గా కలిసి నటించారు ఇద్దరు. అక్కడ కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. టాలీవుడ్ లో ఆ విధంగా ఇద్దరూ తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా అయితే ఒక రేంజ్ లో హిట్ అయింది. రెండు భాగాలు కూడా భారీ వసూళ్లు సాధించాయి. హాలీవుడ్ లో కూడా ఈ రెండు భాగాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక అక్కడి నుంచే వీరి జోడి మీద చర్చలు మొదలయ్యాయి. మిర్చి సినిమా తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. 

 

కాని అది నిజం కాదని తెలిసింది. వీరి రోమాన్స్ కి ఎందరో ఫాన్స్ ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటూ ఉంటారు. దీనిపై ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా మీడియా మాత్రం వీరి పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు ఏదోక వార్త రాస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ గా ఉన్నా మీడియా మాత్రం తనకు నచ్చిన వార్త తాను రాస్తూ సందడి చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: