పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తానని చెప్పినప్పటి నుండి ప్రతీరోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. పవన్ రీ ఎంట్రీ సినిమా ఇలా ఉంటే బావుంటుందంటూ ప్రతీ ఒక్కరూ సలహా ఇచ్చారు. అయితే అవన్నీ పక్కన పెడుతూ అసలేమాత్రం హీరోయిజం లేని బాలీవుడ్ పింక్ సినిమా తెలుగు రేమేక్ లో నటిస్తుండడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మొన్న విడుదలైన సంగతి తెలిసిందే.

 

 

 

అయితే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ క్రిష దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి విరూపాక్ష అనే పేరు కూడా పెట్టారని సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి టైటిల్ ఖరారు కాలేదు. తాజాగా ఈ సినిమా నుండి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. మనకి ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటులా కనిపిస్తాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందట. 

 

 

 

హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా కోసం సెట్లు కూడా వేశారట. సినిమాలో ఎక్కువభాగం అక్కడే షూటింగ్ జరుపుకోనుందట. ఇక పీరియాడిక్ డ్రామాగా తెరఎకెక్కుతున్న ఈ చిత్రం మనల్ని ఔరంగజేబు కాలానికి తీసుకెళ్తుందట. అప్పటి సాంఘీక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని తెరమీద చూపించబోతున్నారట. మార్చ్ 8వ తేదీనపవన్ కళ్యాణ్సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట.

 

 

 

ఇందులో ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారని అంటున్నారు. ఒకరేమో బాలీవుడ్ నుండి జాక్వలైన్ ఫెర్నాండేజ్ గా వార్తలు వస్తున్నాయి. మరొకరు ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదట. ప్రగ్యా జైశ్వాల్ పేరు వినిపించినా చివర్లో ఆమెని వద్దనుకున్నట్టు తెలిసింది. మరి చివరికి ఎవరు కన్ఫర్మ్ అవుతారో చూడాలి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ చిత్రం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: