రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న జోడీ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఇద్దరు చేసిన గీతా గోవిందం సూపర్ హిట్ అవగా ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ అంచనాలను అందుకోలేదు. అయితే ఒక సినిమా ఫ్లాప్ అయినంత మారనా ఈ జోడీపై డౌట్ పడాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం లో హిట్ పెయిర్ గా అదరగొట్టిన ఈ ఇద్దరి కెరియర్ కు ఆ సినిమా టర్నింగ్ పాయింట్ అయ్యేలా చేసుకున్నారు. ఛలో తర్వాత రష్మిక, రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ కలిసి చేసిన సినిమా గీతా గోవిందం.

 

అసలైతే ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ముందు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ను అనుకోవడం వాళ్ళు కాదని చెప్పడం జరిగిందట. ఆ లక్కీ ఛాన్స్ రాష్మికకు దక్కింది. సినిమాలో విజయ్, రష్మిక చాలా బాగా చేయడమే కాదు ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 

 

ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా విజయ్, రష్మికల మధ్య ఏదో జరుగుతుంది అన్న వార్తలు వచ్చాయి. విజయ్ వల్లే రష్మిక రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరుపుకుని కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మరి సినిమాలు చేస్తుంది. గీతా గోవిందం తర్వాత విజయ్, రష్మిక చేసిన డియర్ కామ్రేడ్ మూవీలో ఇద్దరు మరింత రెచ్చిపోయారు. సినిమాలో వీరిద్దరి లవ్ సీన్స్ చూసి అందరు షాక్ అయ్యారు. సినిమా ఆడలేదు కాని డియర్ కామ్రేడ్ కూడా హిట్ అయ్యుంటే విజయ్, రష్మిక మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసేవారు. ఇప్పటికి కూడా విజయ్ ఒ మంచి కథ వస్తే రష్మికతో చేయాలని చూస్తున్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరు ముందు వరకు ఏమో కాని ఆ సినిమా హిట్ అవడంతో స్టార్ అవకాశాలు అందుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన భీష్మ సినిమాతో కూడా రష్మిక మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: