సినిమా ఇండిస్ట్రీలో సినిమా హిట్లు ఉంటాయి. ప్లాపులు ఉంటాయి. మ‌రియు కొన్ని సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యి ఓ రేంజ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన‌వి ఉన్నాయి. ఇక ఓ సినిమాలో హీరో హీరోయిన్ల జోడీ బావుందని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని పేరొస్తే... వాళ్లను తమ సినిమాల్లో రిపీట్ చేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ ఈ ఫార్ములా బాగానే వ‌ర్కోట్ అయ్యింది.. అవుతోంది కూడా. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. ఇండియ‌న్ స్క్రీన్ ఎవ‌ర్ గ్రీన్ పెయిర్‌..  షారుఖ్ ఖాన్, కాజోల్.

 

వీరిద్ద‌రి కాంబినేష‌న్ 1995 అక్టోబర్ 20న విడుద‌లైన  దిల్ వాలే దుల్హనియే లేజాయేంగే ఎంత పెద్ద స‌క్సెస్‌ను అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మధురమైన ప్రేమకథా కావ్యం.  ఈ సినిమాకు ఆదిత్య చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. యశ్ చోప్రా నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు.  ఈ చిత్రంలో రాజ్‌(షారుఖ్ ఖాన్, సిమ్రన్(కాజోల్)  అనే యువ జంట చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. వీరిద్దరూ ప్రవాస భారతీయులు కాగా, యూరోప్ కు స్నేహితులతో వెళ్ళినప్పుడు కలుసుకుని ప్రేమించుకుంటారు.

 

సిమ్రన్ పెళ్ళి కోసం  భారతదేశం వచ్చిన  ఆమె, ఆమె కుటుంబం మనసు గెలుచుకుని ఆ  పెళ్ళి తప్పించి రాజ్ ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం. తెలుగులో ప్రేమించి పెళ్లాడుతా అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఇక్కడ కూడా మంచి హిట్ నే సాధించింది. అంతేకాకుండా.. ఈ సినిమా దాదాపు మహారాష్ట్రలోని బొంబాయిలోని మరాఠ మందిర్‌లో 10ఏళ్లకు పైగా ఏకధాటిగా ఆడి రికార్డు సృష్టించింది.

 

అలాంటి చిత్రాన్ని ఇటీవ‌ల‌ ట్రంప్ కూడా ఈ వేదికపై ప్రస్తావించడం విశేషం. కాగా, ఈ సినిమాతో షారుఖ్, కాజోల్ జంట సూపర్ హిట్ పెయిర్‌గా కితాబునందుకుంది. తర్వాత వారిద్దరూ కలిసి కుచ్ కుచ్ హోతా హై, మై నేమ్ ఈజ్ ఖాన్,  కభీ ఖుషీ కభీ గమ్ ఇలా ఎన్నో చిత్రాలలో కూడా మంచి కెమిస్ట్రీని పండించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. మ‌రియు బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ జోడీగా షారుఖ్‌, కాజోల్ నిలిచారు.
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: