టాలీవుడ్లో కంటెంట్ బేస్ చేసుకుని గ్రామ నాటకాలు చాలా తక్కువుగా వస్తుంటాయి. గతంలో ఈ తరహా సినిమాలు వచ్చేవి. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత పలాస 1978 అనే సినిమా వచ్చింది. ఇక ముందు నుంచే మంచి హైప్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రివ్యూలు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా కథా పరంగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో పలాస అనే పట్టణంలో ఉన్నత కులాల వారికి, బడుగు బలహీన వర్గాలకి మధ్య ఉన్న విభేదాలను చెప్పే కథ.
ఈ క్రమంలోనే షావుకారుపై దిగువ జాతికి చెందిన జానపద పాటలు పాడే మోహన రావు(మోహన్ రావు) – రంగ రావు(తిరువీర్) అనే అన్నదమ్ములు ఎదురు తిరిగి భైరాగిని చంపేస్తారు. ఈ క్రమంలోనే చిన్న షావుకారు వాళ్ల సపోర్ట్‌తో అన్నపై గెలుస్తాడు. అక్కడి నుంచీ చిన్న షావుకారు ఆ అన్నదమ్ములను రౌడీలుగా ఎలా మార్చారు ? వారిని ఎలా ? వాడుకున్నాడు. చివరకు రౌడీలుగా మారిన ఈ అన్నదమ్ముల కథ ? ఎలా మలుపులు తిరిగింది ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఫైనల్‌గా ఉన్నత కులాలు... బడుగు కులాలకు మధ్య ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ.
ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చదు. అయితే ఉత్తమ కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి స్క్రీన్ ప్లే కలిగి ఉండడంతో ప్రశంసించాల్సిన సినిమాగా నిలుస్తుంది. రోటీన్ స్టోరీ లైన్ అన్నది పక్కన పెడితే ఈ సినిమాలు తీసే వారు తక్కువై పోయారు. ఈ సినిమా డైరెక్టర్ కరుణ కుమార్‌ను ఖచ్చితంగా ప్రశంసించాలి.