దిల్ రాజ్ నిర్మాణ సంస్థలో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా అది ఒక అదృష్టంగా భావిస్తారు. హీరోల రేంజ్ కి తగ్గట్టుగా వారికి భారీ పారితోషికాలు ఇస్తూ వేగంగా సినిమాలు తీసే దిల్ రాజ్ ఇండస్ట్రీలో అందరివాడుగా కొనసాగుతూ వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే ఈమధ్య కాలంలో చాలామంది హీరోలు దిల్ రాజ్ మాటలను నమ్ముకుని నష్టపోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 


ఇక ఈకామెంట్స్ వివరాలలోకి వెళితే ఒక సినిమా కథను విన్న వెంటనే ఆమూవీ జయాపజయాల గురించి అంచనా వేయడమే కాకుండా ఆమూవీలో హీరో పాత్రకు ఎవరు బాగా సరిపోతారు అన్నవిషయాలు చెప్పడంలో దిల్ రాజ్ కు మంచి ప్రతిభ ఉంది. ఈపాయింట్ పై ఆధారపడి దిల్ రాజ్ నమ్మకాన్ని గౌరవించి తమకు ఇష్టం లేకపోయినా సినిమాలు చేసి కెరియర్ పరంగా నష్టపోతున్న హీరోల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


హీరో నితిన్ కు దిల్ రాజ్ నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ కథ ఏమాత్రం నచ్చలేదు అని అంటారు. అయితే ఆమూవీ సూపర్ హిట్ అవుతుంది అని దిల్ రాజ్ పదేపదే చెప్పడంతో మొహమాటంతో నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ లో నటించి ఆమూవీ ఫెయిల్ అవ్వడంతో తిరిగి కోలుకోవడానికి ‘భీష్మ’ విడుదల అయ్యేవరకు వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. 


అదేవిధంగా ఒకప్పుడు క్రేజీ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజ్ తరుణ్ కు దిల్ రాజ్ తీసిన ‘లవర్’ మూవీ కథ ఏమాత్రం నచ్చలేదు అని అంటారు. అయితే దిల్ రాజ్ లాంటి ప్రముఖ నిర్మాత చెప్పడంతో ఆసినిమాలో నటించి తన ఫ్లాప్ ల ఖాతాలో మరో ఫ్లాప్ ను జత చేసుకున్నాడు. ఇక ఈలిస్టులో ముఖ్యంగా పేర్కొన వలసింది యంగ్ హీరో శర్వానంద్ ‘జాను’ కథ విని ఈసినిమా తీయవద్దు అంటూ నాని సలహాలు ఇచ్చినా పట్టించుకోకుండా ఈకథ పై ఉన్న మోజుతో శర్వానంద్ ను బలవంతంగా ఒప్పించిన దిల్ రాజ్ ‘జాను’ వల్ల తాను ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా శర్వానంద్ కెరియర్ ను మరింత అయోమయంలో పడేసాడు. ఇక ప్రస్తుతం దిల్ రాజ్ తీస్తున్న ‘పింక్’ రీమేక్ కథ తన అభిమానులకు నచ్చదు అన్న సందేహాలు మొదట్లో పవన్ కళ్యాణ్ కు ఏర్పడినా పవన్ కు 50 కోట్ల పారితోషికం ఆశ చూపించి పవన్ ను ‘వకీల్ సాబ్’ కు ఒప్పించాడు అని అంటారు. దీనితో ప్రస్తుతం దిల్ రాజ్ అంచనాలు తారుమారు అవుతున్న పరిస్థితి ‘వకీల్ సాబ్’ కూడా తప్పదా అంటూ పవన్ అభిమానులు అనుమాన పడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: