తెర మీద అందాల రాశులుగా ఎన్నో అద్భుత పాత్రలకు జీవితం పోసిన హీరోయిన్లు రియల్‌ లైఫ్‌లో మాత్రం తమ అందానికి ఏ మాత్రం సరితూగని వారిని పెళ్లాడారు. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా ఎన్నో అద్భుత పాత్రల్లో అలరించిన అలరించిన శ్రీదేవి, రియల్‌ లైఫ్‌లో నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడింది. అయితే పెళ్లి సమయంలో బోనీ అందంగానే ఉన్నా.. తరువాత తరువాత బాగా బరుపు పెరిగి వయసైన వ్యక్తిగా కనిపించేవాడు. కానీ శ్రీదేవి మాత్రం అప్పుడు కూడా గ్లామర్‌ షోతో అదరగొట్టింది. సినీ వేడుకల్లో శ్రీదేవి బోనీల జంటను చూసిన అభిమానులు పెదవి విరిచేవారు.

 

అదే స్థాయిలో నిరాశపరిచిన మరో బాలీవుడ్ జోడి ఉదయ్‌ చోప్రా, నర్గీస్‌ ఫక్రీ. అరేబియన్‌ అందంలా కనిపించే నర్గీస్‌ వెండితెర మీద పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గ్లామర్‌ విషయంలో మాత్రంఫుల్ మార్క్స్‌ సాధించింది. అయితే ఈ భామ సినిమాల్లో కమెడియన్‌ ఎక్కువ హీరోకు తక్కువ రేంజ్‌ పాత్రలు వేసే ఉదయ్‌ చోప్రాను పెళ్లాడింది. దీంతో వీళ్లకెలే సెట్ట అయ్యిందా అని అభిమానులు అవాక్కయ్యారు.

 

మరో అందాల భామ జూహీ చావ్లా కూడా తన జోడి విషయంలో అభిమానులకు షాక్‌ ఇచ్చింది. సూపర్‌ స్టార్స్‌ సరసన సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన జూహీ చావ్లా రియల్‌ లైఫ్‌లో జై అనే వ్యాపార వేత్తను పెళ్లాడింది. జూహీ అందానికి ఏ మాత్రం సరితూగని జై అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. అదే స్థాయిలో నిరాశపరిచిన మరో బాలీవుడ్ జోడి అనురాగ్‌ కపూర్‌, కల్కి కొచిన్‌. అనురాగ్ దర్శకత్వంలో నటించిన కల్కి తరువాత అతడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తరువాత ఇద్దరి పొసగక విడాకులు తీసుకున్నారు. అభిమానులకు షాక్‌ ఇచ్చిన మరో బాలీవుడ్‌ జోడి ఫరా ఖాన్‌. కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకురాలిగా మారిన ఫరా తన కంటే వయసులో చాలా చిన్నవాడైన శిరీష్ కుందర్‌ను పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: