సాధార‌ణంగా ఓ సినిమాకు హీరో, హీరోయిన్​ మ‌ధ్య‌ కెమిస్ట్రీ ఎంత అవసరమో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక సినిమాలో కెమిస్ట్రీ పండాలంటే హీరో, హీరోయిన్ మధ్య ఆఫ్ స్క్రీన్ కొంత పరిచయం ఉండాల్సిందే. అప్పుడే సినిమాలో కెమిస్ట్రీని పండించ‌డం మ‌రింత సులువు అవుతుంది. ప‌రిచ‌యాలు లేని వారు కూడా ఆ విష‌యంలో బాగానే స‌క్సెస్ అయ్యార‌నుకోండి! అది వేరే విష‌యం. అయితే కొన్ని సినిమాల్లో కేవ‌లం హీరో, హీరోయిన్ల‌ మ‌ధ్య‌నే కాకుండా.. హీరో, హీరోల‌ మ‌ధ్య కూడా ఓ మంచి కెమిస్ట్రీ క‌నిపిస్తుంది. అందులో చెప్పుకుంటే.. చిరంజీవి మ‌రియు శ్రీ‌కాంత్‌. 

 

జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వ‌హించిన `శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్` సినిమాలో చిరంజీవి, శ్రీ‌కాంత్ మ‌ధ్య సంబంధం ఎంతో చక్క‌గా ఉంటుంది. మ‌రియు అదే శ్రీ‌కాంత్.. చిరంజీవి కొడుకు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు బాబాయిగా గోవిందుడు అందరివాడేలే సినిమాలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇక శ్రీ‌కాంత్‌, చిరంజీవి ఈ రిలేష‌న్‌ను రీల్ లైఫ్‌కే ప‌రిమితం చేయ‌కుండా.. రియ‌ల్ లైఫ్‌లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌.. ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. అప్ప‌ట్లో మంచి  స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తోన్న వీరిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు. 

 

వాటిలో పౌరాణిక, జానపద, చారిత్రక,సాంఘిక చిత్రాలున్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు. ఈ ఒక్క ఘ‌నత కేవ‌లం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌కే ద‌క్కింది. ఇక కృష్ణ‌, శోభ‌న బాబు కాబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా కృష్ణ, శోభన్ బాబులు స్టార్లుగా ఎదిగిన తరువాత వచ్చిన గంగ - మంగ, కృష్ణార్జునులు, మండే గుండెలు, ముందడుగు లాంటి చితాలు బాక్సాఫిస్ వద్ద కనకవర్షం కురిపించాయి. బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే.. అమితాబ్- ధర్మేంద్ర, సంజయ్‌ దత్‌ - గోవింద, ఆమిర్‌ ఖాన్‌ - సల్మాన్‌ ఖాన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు ఎంత మంచి స‌క్సెస్ అయ్యాయో అంద‌రికి తెలిసిందే.


  
   

  

మరింత సమాచారం తెలుసుకోండి: