అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ మినహాయించి బాలీవుడ్, కొలీవుడ్, సాండల్ వుడ్ లలో కూడా బీభత్సమైన క్రేజ్ ని సంపాదించాడు మన రౌడీ బాయ్ విజయ్. ప్రేమికుల రోజు రిలీజ్ అయిన అతని వరల్డ్ ఫేమస్ లవర్ డిసాస్టర్ సినిమా గా పేరు తెచ్చుకున్నా అతని స్టార్ డం మాత్రం అనువంత అయినా తగ్గడం లేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ ని కరణ్ జోహార్ నెత్తిన పెట్టుకున్నాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.ఈ బాలీవుడ్ ఫిలిమ్ మేకర్ విజయ్ కోసం చుంకి పాండే కూతురు అనన్య పాండే ని ఒప్పించి మరీ అతని సరసన నటింపజేస్తున్నాడు.



అలానే పూరి జగన్నాథ్, చార్మి లతో కలిసి విజయ్ ఫైటర్ సినిమాని నిర్మిస్తున్నాడు కరణ్ జోహార్. నిజం చెప్పాలంటే మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యొక్క సూపర్ డూపర్ నటన నైపుణ్యం, ఒరిజినాలిటీ, పర్సనాలిటీ విపరీతంగా నచ్చిన కరణ్ జోహార్ అతనిని భారత దేశంలో గొప్ప నటుడిగా తీర్చిదిద్దేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ సవాలక్ష ఆఫర్స్ ను విజయ్ కు సమర్పిస్తున్నాడు. ఐతే ఆ ఆఫర్లలన్నిటిలో అందర్నీ నోరెళ్ళబెట్టేలా చేస్తుంది ఏంటంటే... ఏడాదికి వంద కోట్ల డీల్. అవును, విజయ్ దేవరకొండ ని ఏడాదికి రూ.100 కోట్లు పెట్టి కరణ్ జోహార్ కొనుక్కున్నారు అని సినీ వర్గాల నుంచి టాక్ బలంగా వినిపిస్తుంది.



ఐతే, ఈ డీల్ ప్రకారం ఏడాది పొడుగునా కరణ్ జోహార్ ఎప్పుడు పిలిచినా విజయ్ దేవరకొండ వెళ్లి అతను చెప్పినట్టు విని సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. ఇకపోతే విజయ్ తదుపరి సినిమా ఫైటర్ తెలుగుతో పాటు హిందీ లో కూడా విడుదల కానున్నది. ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ నేషనల్ స్టార్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాడని కరణ్ జోహార్ భావిస్తున్నారట. ఏదేమైనా ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మన తెలుగు కుర్రాడు సంవత్సరానికి రూ.100 కోట్లను సంపాదించడం దిమ్మతిరిగే వార్త అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: