టెలిస్కోప్ మరియు బయోస్కోప్ తొలినాళ్లలో అనగా 1980 దశకంలో దూరదర్శన్ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘రామాయణ్’ సీరియల్‌కు ఎంత డిమాండ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రజలు, భాషతో నిమిత్తం లేకుండా.. తెగ చూసేవారు. ఇక అందులో నటించే నటి నటులను నిజంగా వారే దేవుళ్లు అని అనుకునేంతగా ఆడియన్స్ లీనమై ఆ సీరియల్స్‌ని తిలకించేవారు. అంతగా ఆ సీరియల్స్ ప్రేక్షకులని మెప్పించేయి.

 

IHG

 

ఇక అందులో "అరుణ్ గోవిల్" అనే హిందీ నటుడు రాముడి పాత్రలో నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందారు. సీత పాత్రలో 'దీపిక చిఖాలియా', మరియు లక్ష్మణుడి పాత్రను 'సునీల్ లహ్రీ'లు పోషించారు. ఈ సీరియల్‌ సూపర్ హిట్ అవడంతో ముగ్గురి పేర్లు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోరుపోయాయి. అయితే అక్కడే వచ్చింది అసలు చిక్కు.. వారి పాపులారిటీని కాష్ చేసుకోవాలని కొన్ని మ్యాగజైన్లు వీరి చేత బోల్డ్ ఫొటోషూట్స్ చేయించాలని కోరాయట.

 

ఇక ఎన్నో మరెన్నో అంతర్జాతీయ మ్యాగజైన్లు తమను ఆవిధంగా అడిగాయని, కానీ దానికి తమ ముగ్గురిలో ఎవ్వరూ ఒప్పుకోలేదని అరుణ్ గోవిల్ వెల్లడించారు. అలాగే పెద్ద మొత్తంలో డబ్బుని కూడా ఆఫర్ చేశారట!అంత పవిత్రమైన పాత్రల్లో నటించి, అలాంటి నీచమైన ఫొటోషూట్స్‌లో పాల్గొంటే ప్రజలకు తమపై ఉన్న గౌరవం, నమ్మకం పోతుందని,  వారు సదరు ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారట.

 

IHG

 

రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ ఈ విషయాలను ప్రస్తావిస్తూ... కొన్ని షాకింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చారు.. ఈ సీరియల్‌లో నటించడం వల్ల తనకు సినిమా అవకాశాలు లేకుండాపోయానని చెప్తూ మదన పడ్డారు. ‘‘నేను హీరోగా నా బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే ‘రామాయణ్’ సీరియల్ అయిపోయిందో నా కెరీర్‌ కూడా అప్పుడే ముగిసిపోయింది. అవకాశాల కోసం వెళ్తే నేను కేవలం రాముడి పాత్రకే పనికొస్తానని, మరే పాత్రల్లోనూ తీసుకోలేమని ముఖం చాటేసేవారని అరుణ్ గోవిల్ కలత చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: