`మా` అధ్య‌క్షుడు లాంగ్ లీవ్ వెనుక తెర‌వెనుక ర‌హ‌స్యాలు చాలానే ఉన్నాయి. సినిమాలే కాదు సినీ సెల‌బ్రెటీల మ‌ధ్య ఏం జ‌రిగినా తెలుసుకోవాల‌నే ఆశ‌క్తి సామాన్య ప్ర‌జ‌ల్లో కామ‌న్‌గా ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో మాలో జ‌రుగుతున్నీ ఈ ఘ‌ట‌న‌లు `మా`లో ఇంకా పెంచేశాయి. ముఖ్యంగా `మా` అధ్య‌క్షుడు న‌రేష్ తీరు పై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. న‌టీన‌టులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే వీటికి ఫుల్‌స్టాప్ పెట్టాల‌న్న సినీ పెద్ద‌లు తెర‌వెనుక భారీ స్క్రీన్‌ప్లే రెఢీ చేశార‌ట‌. అందులో భాగంగానే న‌రేష్ ఆక‌స్మిక సెల‌వు అని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌గా ఉన్న న‌రేష్‌41 రోజుల పాటు లాంగ్ లీవ్‌లో వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న స్థానంలో యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మా ఉపాధ్య‌క్షుడు బెన‌ర్జీని క‌మిటీ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఇదంతా కూడా సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌కియ అయితే దీని పై ఎవ్వ‌రూ కూడా పెద్ద‌గా దృష్టిని సారించ‌రు. కానీ ఇటీవ‌ల కాలంలో `మా`లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలను గ‌మ‌నించిన వారికి న‌రేష్ లీవ్‌లో ఏదో మ‌త‌ల‌బ్ ఉంద‌ని భావిస్తున్నారు.

 

`మా` అధ్య‌క్షుడి నరేష్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు న‌టీన‌టుల‌కు రుచించ‌డం లేద‌ట‌. సినీ పెద్ద‌లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. గ‌తంలో ఫండ్ రైజింగ్ పేరుతో అమెరికాలో ఒక కార్య‌క్ర‌మాన్ని రెయిజ్ చేశారు. అయితే ఆ సంద‌ర్భంగా ఆర్ధిక అవ‌క‌త‌వ‌కలు వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ బైలాస్ ప్ర‌కారం అధ్య‌క్షుడికి చాలా విశేష అధికారాలు ఉన్నాయి.  అయితే ఈ ప‌వ‌ర్స్‌ను `మా` అధ్య‌క్షుడుగా ప‌ద‌వులు చేప‌ట్టిన న‌రేష్ దుర్వినియోగం చేస్తున్న‌ట్లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అందుకే అధ్య‌క్షుడు విశేష అధికారుల‌కు క‌త్తెర వేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌. ఇటీవ‌లె జ‌య‌సుధ‌, చిరంజీవి, కృష్ణంరాజు త‌దిత‌ర పెద్ద‌ల‌తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ క‌మిటీ అయింద‌ట‌. ఆ స‌మావేశంలో `మ` అధ్య‌క్షుడి విశేష అధికారాల పై ప్ర‌త్యేక చర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

 

వాటిని మార్చాల‌ని నిర్ణ‌యం వ‌చ్చినప్పుడు. న‌రేష్ ఆ ప‌ద‌విలో ఉండ‌గా అవి చేయ‌డ‌మ‌నేది స‌మంజ‌సం కాద‌ని భావించార‌ట‌. ఇండ‌స్ట్రీ అంతా ఈ విష‌యంలో ఒక్క‌టిగా ఉండ‌డంతో సినీపెద్ద‌లు చెప్పిన‌ట్లుగా న‌రేష్ లాంగ్ లీవ్‌లో వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ట‌. ఆ వెనువెంట‌నే ఉపాధ్య‌క్షుడుగా ఉన్న బెన‌ర్జీని తాత్కాలిక అధ్య‌క్షుడిగా చేశారు.ఈ 41రోజులు బెన‌ర్జీని ఆ అధికారంలో కూర్చోబెట్టి `మా` అధ్య‌క్షుడి అధికారాల‌కు కోత వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఒక పై `మా` అధ్య‌క్షుడు ఎవ‌రైనా తోక జాడిస్తే ఆయ‌న్ని తొల‌గించే అధికారం క‌మిటీకి క‌ట్ట‌బెడుతున్న‌ట్లు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: