శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు-2’ చిత్రం చిత్రీకరణ సందర్భంగా క్రేన్ ప్రమాదం సంబవించి డైరెక్టర్  శంకర్‌ అసిస్టెంట్  మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ మరో వ్యక్తి చంద్రన్‌ మృతిచెందిన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో దర్శకుడు శంకర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయని మరో పది మంది వరకు గాయపడినట్లు తెలిసింది.  చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్రం షూటింగ్ జరుగుతుండగా 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడి అక్కడే ఉన్న టెంట్‌పై పడింది. పక్కనే ఉన్న ఈ ముగ్గురు ఆ ప్రమాదంలో మరణించారు.. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అప్పుడు లైకా సంస్థ ప్రకటించింది.

 

ప్రమాద సంఘటన కేసుని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న వారిని విచారించారు.  క్రేన్ ఆపరేటర్ ని అరెస్ట్ చేశారు.  అంతే కాదు నటుడు కమల్ హాసన్, డైెరెక్టర్ శంకర్ కి సమన్లు కూడా పంపారు.  ఈ నేపథ్యంలో శంకర్, కమల్ హాసన్ లు పోలీసుల మందుకు హాజరై కేసు వివరాల గురించి మాట్లాడారు.  తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ ని విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇందుకు సంబంధించి సమన్లు అందుకున్న వెంటనే కాజల్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఘటన  జరిగిన సమయంలో అక్కడే  ఉన్న కమల్, కాజల్ తో పాటు దర్శకుడు శంకర్ త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కాజల్ ఆ మద్య పోస్ట్ చేస్తూ తమ కళ్ల ముందు ఉన్నవారు మరణిస్తే ఆ ఆవేదన ఎంత భయానకంగా ఉంటుందో నా జీవితంలో ఇప్పుడే తెలుసుకున్నానని పోస్ట్ పెట్టింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: