జబర్ధస్త్ లో తనదైన కామెడీ ముద్ర వేసుకున్నాడు హైపర్ ఆది.  అభి టీమ్ తో పరిచయం అయిన ఆది తనకున్న స్కిల్స్ తో తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగాడు.  ఏడేళ్లుగా కొనసాగుతున్న ‘జబర్ధస్త్’ లో ఇప్పటికే ఆది టీమ్ అంటే ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు.  ‘జబర్ధస్త్’ ఇప్పటి వరకు ఎంతో మంది కమెడీయన్స్ తమదైన కామెడీ మార్క్ చాటుకుంటూ వస్తున్నారు.  అయితే హైపర్ ఆది, రైజింగ్ రాజు కామెడీ స్కిట్ అంటే జడ్జీలకే కాదు... అక్కడ ఉండే టీమ్ డీలర్లు కూడా ఇష్టపడుతుంటారు.  మనోడు చేసే స్ఫూఫ్ మాములూగా ఉండదు.  ముఖ్యంగా హైపర్ ఆది, రైజింగ్ రాజు ల మద్య సాగే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.  అయితే హైపర్ ఆది టీమ్ లో మరో ముఖ్యమైన వ్యక్తి దొరబాబు. 

 

గతంలో కొన్ని అడల్ట్ వీడియోలో నటించిన దొరబాబు అనుకోకుండా హైపర్ ఆది టీమ్ లో చోటు సంపాదించాడు.  ఇక దొరబాబు ని ప్రతి స్కిట్ లో హైపర్ ఆది గతంలో నటించిన యూట్యూబ్ వీడియోల ప్రస్తావన తెస్తూనే ఉంటాడు.. ఆడవాళ్లు అంటే మోజు అనే రీతిలో డైలాగ్స్ కొడుతూనే ఉంటారు.  అయితే ఇది స్కిట్స్ వరకు ఓకే.. కానీ దొరబాబు నిజంగానే ఆడవారితో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్ కావడం సంచలనంగా మారింది.  గత మంగళవారం నాడు విశాఖపట్నంలో ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టు చప్పుడు కాకుండా జరగుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు  పక్కా సమాచారంతో రైడింగ్ చేశారు.  అయితే ఈ  రైడ్‌లో  దొరబాబు, పరదేశిలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఈ సెక్స్ రాకెట్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

 

దాంతో జబర్ధస్త్ లాంటి మనోరంజకమైన ప్రోగ్రామ్ లో పాల్గొంటూ సెలబ్రెటీ హోదా సంపాదించుకున్న దొరబాబు ఇంత కక్కుర్తి పడటం ఏంటని విమర్శిచారు.  ఇప్పటికే మల్లెమాల జబర్ధస్త్ టీమ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాదు దొరబాబు, పరదేశిలను కూడా పక్కనబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై మల్లెమాల యాజమాన్యం,  టీమ్ లీడర్ ఆది అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేస్తేకానీ క్లారిటీ రాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: