ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా వైరస్.  ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా మరణించారు.  చైనాలోని పుహాన్ లో ప్రబలిన ఈ భయంకరమైన వైరస్ ప్రంచంలోని వివిధ దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు నగరాల్లో ప్రజలు మాస్కులు ధరించి తిరుగుతున్నారు. అయితే ఇదే అదనుగా కొంత మంది వ్యాపారస్తులు మాస్క్ రేట్లను బాగా పెంచేస్తున్నారు.  కొంతమంది బ్లాక్ మార్కెట్ కూడా చేస్తున్నారు.  హైదరాబాద్‌లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలువురు గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

 

ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే..రామ్ చరణ్ సతీమణి ఉపాసన కరోనా వైరస్‌పై తగిన జాగ్రత్తలు చెప్పారు. అపోలో లైఫ్ చైర్ పర్సన్ ఉపాసన మాస్క్ ల వాడాకం పై ప్రజలకు అవేర్ నెస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను మాస్క్ ల అవసరాన్ని.. వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడాన్ని ఓ వీడియోను రూపొందించారు ఉపాసన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనాపై భయం వీడి బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.  

 

అవసరం ఉంటేనే మాస్కు ధరించాలని, మీకు కరోనా ఉన్నట్టు అనుమానం వచ్చినప్పుడు, ఇతరులకు కరోనా సోకినట్టు అనిపించినప్పుడు మాత్రమే మాస్కులు ధరించాలని సూచించారు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతోనే ఒకరికొరకు గౌరవించుకొవాలని తెలిపారు. నమస్కారంతో చాలా అంటురోగాలు రాకుండా ఉంటాయని అన్నారు.  మార్కెట్ లో దొరికే మాస్క్ ల కోసం ఎదురుచూడకుండా ఇంట్లో  టిష్యూతో మాస్క్ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉపాసన చెప్పే విధానంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: