టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. అంతేకాక మొన్నటి ఎన్నికల్లో తన ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేసారు పవన్. అయితే రెండేళ్ల నుండి మళ్ళి సినిమాల్లో నటించాలని తన ఫ్యాన్స్ కోరుతుండడంతో ఎట్టకేలకు వకీల్ సాబ్ ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు పవన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పవన్ ఒక పవర్ఫుల్ లాయరు గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమోని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 'మగువ మగువ' పల్లవితో సాగె ఈ మెలోడియస్ సాంగ్ ని యువ సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించగా సంగీత దర్శకడు థమన్ అదిరిపోయే ట్యూన్ ని అందిచడం జరిగింది. 

 

ఇక ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో లిరికల్ వీడియో యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ తో దూసుకెళ్తోంది. కాగా ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో ని ఉమెన్స్ డే సందర్భంగా ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే నెల రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: