మన తెలుగులో చాలా మందికి ఒక మానసిక సమస్య ఉంటుంది. ప్రేక్షకులకు ముఖ్యంగా... మహానటి సినిమా చూసి వచ్చి బయట పాప్ కార్న్ తింటూ ఆ సీన్ లో కీర్తి అలా చేయకుండా ఉంటే బాగుండేది. ఈ సీన్ లో కీర్తి ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. అలా చేసింది కాబట్టి ఆ సీన్ అంత బాగా రాలేదు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సినిమాను సినిమాగా చూడటం మానేశారు. 

 

ఆ సీన్ అక్కడ పడి ఉంటే బాగుండేది ఈ సీన్ ఇక్కడ పడి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక రివ్యూల విషయానికి వస్తే కొంత మంది డబ్బులు తీసుకుని రాయడం మొదలుపెట్టారు ఈ మధ్య. దీనితో ఇప్పుడు చిన్న హీరోలు బాగా ఇబ్బంది పడుతున్నారు. శర్వానంద్, సమంతా కాంబినేషన్ లో వచ్చిన జాను సినిమాలో ఏ ఒక్క సీన్ బాగా లేదని కొందరు రాసారు. 

 

మరి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రాసారో ఏంటో తెలియదు. దీని గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం గాని, ఒక సినిమా అనేది చాలా మంది ప్రాణం పెట్టి తీస్తూ ఉంటారు. సినిమా అనేది చాలా మందికి ఒక ప్రపంచం. ఈ విషయం తెలియకుండా కొందరు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారం చిన్న హీరోల పాలిత శాపం గా మారిపోతుంది. నెలలు నెలలు సినిమా మీద ప్రాణం పెట్టి తీసే దర్శకులు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఏర్పడింది. 

 

చాలా వరకు సినిమాలు ఫ్లాప్ కావడానికి దర్శకుడు, నిర్మాత అప్పుల పాలు అవ్వడానికి రివ్యూలే కారణమని చాలా మంది ఈ మధ్య కాలంలో కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సగం నాశనం అవ్వడానికి ఈ రివ్యులే కారణం. అతనిని టార్గెట్ చేసిన ఒక పెద్ద ఫ్యామిలీ వ్యతిరేకంగా రివ్యూలు రాయించింది. ఆ విధంగా అతని కెరీర్ ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: