టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే శకం నడుస్తుంది. వరుస ఆఫర్లు రావడంతో ఇప్పుడు ఆమె హవా అంతా ఇంతా కాదు. దాదాపు స్టార్ హీరోలు అందరితో ఆమె హిట్స్ కొట్టేసింది. ఇక కొందరు హీరోలతో నటిస్తుంది. అగ్ర దర్శకులకు ఆమె లక్కీ హీరోయిన్ గా కూడా మారిపోయింది. వరుస ఆఫర్లు రావడంతో చాలా చాలా బిజీ అయిపోయింది. చిన్న ఆఫర్ వచ్చినా సరే తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉందని ఆ స్టైల్ చూపిస్తూ కాస్త నిర్మాతలను దర్శకులను కంగారు పెడుతుంది ఈమె. 

 

ఏ మాటకి ఆ మాట ఈ ఏడాది సూపర్ హిట్ తో మొదలుపెట్టింది పూజ. ఇప్పుడు ప్రభాస్ తో అఖిల్ తో రెండు సినిమాలు చేస్తుంది. మరో అగ్ర హీరో పక్కన కూడా ఈమె ఆఫర్ కొట్టేసింది అంటున్నారు. వంశీ పైడపల్లి మహేష్ బాబు సినిమాలో పాప పేరు ఎక్కువగా వినపడుతుందని త్వరలో ఆమెను ఖరారు చేసే ఆవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు ఈమె గురించి టాలీవుడ్ లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముందు పెట్టని కొన్ని కొన్ని షరతులను ఇప్పుడు ఎక్కువగా పెట్టడం మొదలుపెట్టింది అంటున్నారు జనాలు. 

 

ఈ మధ్య ఒక స్టార్ హీరోతో సినిమా చెయ్యాలని అడిగితే మూడు కోట్లు డిమాండ్ చేయడమే కాకుండా తాను కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ కి వస్తాను అని చెప్పిందని టాక్. ఈ మాట తెలిసిన స్టార్ హీరో అవసరం లేదని ఆమెను పిలవాల్సిన అవసరం అంతకంటే లేదని చెప్తూ వద్దని చెప్పినట్టు టాక్. పాప ఈ మధ్య బిజీ బిజీ అయిపోయింది. ఆఫర్లు రావడంతో బాలీవుడ్ సినిమాలు కూడా అంగీకరిస్తుంది. అక్కడ కోట్లు అడుగుతూ ఇక్కడా కోట్లు డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: