సినీ పరిశ్రమలో అవకాశం రావడం అనేది చాలా కష్టం. ఒక్క అవకాశ౦ వస్తే చాలు నిరూపించుకోవడానికి హీరో అయినా హీరోయిన్ అయినా సరే చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో ఏమో గాని ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలూ సినిమాల్లో అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క అవకాశం వస్తే చాలని భావిస్తూ నానా కష్టాలు పడుతున్నారు. తెలుగు అయినా బాలీవుడ్ అయినా తమిళం అయినా సరే ఈ మధ్య పోటీ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనితో అవకాశాలు రావడం అనేది చాలా కష్టంగా మారింది. 

 

అయితే దీనిని కొందరు నిర్మాతలు మాత్రం చాలా రకాలుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో హీరోయిన్లు అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ దర్శకులకు ఆఫర్లు ఇస్తున్నారు. నిర్మాతలకు కూడా ఆఫర్లు ఇస్తూ చెలరేగిపోతున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు ఈ మధ్య అవకాశాల కోసం కష్టపడే పరిస్థితి టాలీవుడ్ లో నెలకొంది. 

 

ఈ మధ్య ఒక స్టార్ నిర్మాతను కలిసిన ఒక స్టార్ హీరోయిన్ అయితే తనకు అవకాశం ఇస్తే చాలు తాను ఏదైనా చేస్తాను అంటూ... ఏదైనా అంటే లిప్ లాక్ అయినా, బికినీ అయినా స్కిన్ షో అయినా సరే నాకు ఇబ్బంది లేదని చెప్పిందట. ఇక పారితోషికం విషయంలో కూడా తాను డిమాండ్ చేయను అని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఆ నిర్మాత మాత్రం ఆ హీరోయిన్ ని ప్రేక్షకులు చూడకపోవడం తో కాస్త వెనక్కు తగ్గాడని అంటున్నారు. మరి ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. గతంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఆ హీరోయిన్ గారూ.

మరింత సమాచారం తెలుసుకోండి: