ఈ మద్య పిరియాడికల్ సినిమాలపై స్టార్ హీరోలు ఎక్కువగా శ్రద్ద చూపిస్తున్నారు.  ఇప్పటికే బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి.  చారిత్రక నేపథ్యానికి అద్దం పట్టే సినిమాలకు జనాకర్షన కూడా బాగానే ఉంటుంది. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటీష్ సైన్యానికి వెతిరేకంగా పోరాడిన మొట్ట మొదటి వీర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ తో ‘సైరా నరసింహారెడ్డి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్  మోహన్‌లాల్‌  ఈ తరహా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఆ మద్య కేరళాలో ఒకప్పుడు ఒడియాన్ లు ఉన్నట్లు చెప్పేవారు.  ఈ కథ నేపథ్యంలో అప్పట్లో  ‘ఒడియన్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షముల ముందుకు వచ్చి మిశ్రమ విజయాన్ని అందుకున్నారు.  

తాజాగా మోహన్‌లాల్‌ మరో పిరియాడికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు.ఈ మూవీ  ప్రియదర్శన్‌ తెరకెక్కస్తున్నారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా పేరు ‘మరక్కార్‌’  ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. 2019 చివరికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ గా ఉంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రయిలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. హిందీలో అక్షయ్ కుమార్, తమిళ్ లో సూర్య, కన్నడలో యష్, మళయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు.  ఈ సినిమాలో మోహన్ లాల్, అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్‌ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

 

16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.  త్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ప్రణయ్ మోహన్ లాల్, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: