తెలుగులో సింగర్ గా కొనసాగుతున్న రాహూల్ సిప్లిగంజ్ ఇటీవల బిగ్ బాస్ 3 లో సందడి చేశారు.  నాగార్జున్ హూస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 లో మొదటి నుంచి చాలా సైలెంట్ గా ఉంటూ... తన పని తాను చేసుకుంటూ ఇచ్చిన టాస్క్ ల్లో తన స్టైల్ చూపిస్తూ మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు.  దాంతో అప్పటి వరకు మామూలు సింగర్ గా ఉన్న రాహూల్ సిప్లిగంజ్ సెలబ్రెటీ అయ్యారు.  ప్రస్తుతం వెండి తెరపై కూడా మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  అయితే రాహూల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలి ప్రిజమ్ పబ్ లో మొన్న రాత్రి బీరు బాటిల్ తో దాడి జరిగిన విషయం తెలిసిందే. 

 

ఈ ఘటనలో ఓ ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉందని రాహుల్ ఆరోపిస్తున్నాడు.  అయితే  తనపై దాడి చేసిన వ్యక్తి వెనుక రాజకీయ హస్తం ఉందని.. తనకు న్యాయం జరగదని కొంత మంది తనతో అంటున్నారు.. కానీ తెలంగాణ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాను.  అమ్మాయిలపై వారు అనుచిత ప్రవర్తన చేయడం వల్ల నేను వారిని వారించానని.. అందుకు నాపై దాడి చేశారని..  మొన్న రాత్రి జరిగిన గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను.. రాహుల్ సిప్లిగంజ్ ట్విట్టర్ లో  మంత్రి కేటీఆర్ కి విజ్ఞప్తి చేస్తూ ట్యాగ్ చేశారు.

 

తనను పబ్ లో దారుణంగా కొడుతున్న దృశ్యాలతో ఓ వీడియోను రాహుల్ ట్వీట్ చేశాడు. "కేటీఆర్ సర్, దీనిపై సరైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు ఇందులో జోక్యం చేసుకోవాలి. ఒకవేళ ఇందులో నా తప్పు ఉంటే ఏ శిక్షకైనా నేను సిద్దంగా ఉంటానని.. కానీ ఇక్కడ నేనో, ఓ సామాన్యుడో ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకోవాలి?"​ అంటూ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: