పవన్ కళ్యాణ్ సినిమాల్లో టాప్ ర్యాంకే. ఆయన రెండేళ్ళుగా ఏ ఒక్క సినిమా చేయకున్నా కూడా క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఆయన కూడా మరో నాలుగేళ్ళ వరకూ ఎన్నికలు ఎటూ లేవని సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇపుడు పవన్ వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. పవన్ స్పీడ్ చూసి మిగిలిన వాళ్ళే నోళ్ళు వెళ్ళబెడుతున్నారట.

 

ఒకప్పుడు పవన్ సినిమా అంటే ఏడాది రెండేళ్ళు పట్టేది. కానీ రీ ఎంట్రీ తరువాత పవన్ పూర్తిగా మారిపోయాడు. ఎంతలా అంటే ఏడాదికి రెండు సినిమాలు పూర్తి చేసి మూడవది మొదలుపెట్టేంటంతగా. జనవరిలో మొదలెట్టిన వకీల్ సాబ్ ని సమ్మర్ నాటికి ధియేటర్లలోకి దించేయాలని పక్కాగా  పవన్ ప్లాన్ చేస్తున్నాడు.

 

ఆ తరువాత క్రిష్ సినిమాను కూడా స్పీడ్ గా పూర్తి చేసి ఈ ఏడాది చివరలో రిలీజ్ కి ఫిక్స్ చేసేశాడు. అక్కడితో ఆగకుండా హరీష్ శంకర్ సినిమాని ఈ ఏడాది ఎండ్ కి సెట్స్ మీదకు తీసుకురావాలనుకుంటున్నాడుట. ఆ మూవీ తరువాత కూడా మరో రెండు సినిమాలాకు కూడా పవన్ కమిట్ అయాడని లేటెస్ట్ న్యూస్.

 

అంటే పవన్ 29, 30 సినిమాలు కూడా లైన్లో ఉన్నట్లే అనుకోవాలి. ఇందులో ఒక సినిమాను డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తీస్తాడని అంటున్నారు. ఆ మూవీ తరువాత త్రివిక్రం సినిమాను కూడా పవన్ టేకప్ చేస్తాడని అంటున్నారు. మొత్తానికి  ఇప్పటివరకూ చూస్తే పవన్ డైరీ 2021 ఎండింగ్ వరకూ ఫుల్ అయిపోయిందని అంటున్నారు.

 

ఆ తరువాత పవన్ రాజకీయాల్లోకి తిరిగి వస్తారో, మరిన్ని సినిమాలు చేస్తారో చూడాలి. ఎందుకంటే అప్పటికి కూడా ఎన్నికలు మరో రెండేళ్ళు పై దాటిఉంటాయి కాబట్టి. మొత్తానికి పవన్ చూపిస్తున్న ఈ జోరు మిగిలిన వారికి ఆదర్శంగా  ఉంటే టాలీవుడ్ కే ఎంతో మేలు అంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: