కళ్ళెందుకు ఉన్నాయి అంటే చూడడానికి. మరి కళ్ళను తమవైపు తిప్పుకునేందుకే అందాలు కూడా ఉన్నాయి. అందగత్తెలకు అదే గర్వం. ఫిగర్ ఉంటే పొగరు ఉండడంతో తప్పు లేనేలేదు. ఎందుకంటే సొగసు సెగలను తమతో ఉంచుకుంటే వేడెక్కిపోతారు. వాటితో వేపేస్తే అవతలి వారు హీటెక్కిపోతారు. అది సొగసుగత్తెలకు భలే థ్రిల్ గా ఉంటుంది మరి.

 

ఇవన్నీ ఎందుకంటే వెండి తెరను తమ అందాలతో పండించే ఎందరో అప్సరసలు ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అందాల రాక్షసి ఫేం లావణ్యా త్రిపాఠి. ఈ సుందరి అందాల ఆరబోతకు రెడీ అంటోందిట. అనడమే కాదు తన స్కిన్ షోలతో  వెర్రెక్కించే పిక్స్ ని సోషల్ మీడియాలో పెడుతూ రెచ్చగొడుతోందిట.

 

ఆమెకు ఈ మధ్యనే ఓ హిట్ వచ్చిపడింది. అర్జున్ సురవరం పేరుతో నిఖిల్ తో చేసిన మూవీ బాగా ఆడింది కానీ లావణ్యకు మాత్రం చాన్సులు ఎక్కడా లేవు. దాంతో  ఈ అమ్మడి ఇలా లాభం లేదనుకుని అందాలను పరచేస్తానటూ అసలైన ఆయుధం తీసింది.

 

తెలుగులో ఆమె సందీప్ కిషన్ తో ఓ మూవీ చేస్తోంది. అదొక్కటి తప్ప ఆమె చేతిలో కొత్త మూవీ ఒక్కటీ లేదు. దాంతో ఇలా ట్రై చేస్తోందిట.  ఈ దెబ్బకు తమిళంలో ఓ ఆఫర్ ఆమెని వరించింది. అధర్వ మురళీ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ వచ్చింది. రవీంద్ర మాధవ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా లావణ్య  ప్రకటించింది. 

 

కోలీవుడ్ లో బోణీ తగిలింది. సరే, కానీ టాలీవుడ్ ఏమంటుందో మరి ఆమె మొరను ఆలకించి ఇక్కడ కూడా ఎవరైనా వస్తారా. ఈ బోల్డ్ ఆఫర్ ని మెల్ట్ అయి ఎవరైనా హీరోయిన్ గా లావణ్యను బుక్ చేస్తారా అన్నది చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: