టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు, ముందుగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వంతో బాలనటుడిగా చిన్నతనంలో పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే మంచి పేరు గడించారు. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, తొలి సినిమా తోనే సూపర్ హిట్ కొట్టి ప్రిన్స్ గా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇక ఆ తరువాత నుండి తన అందం, అభినయంతో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లిన మహేష్ బాబు, ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా దూసుకెళ్తున్నారు. 

IHG

ఇకపోతే నేడు ఆయన ఒక అత్యద్భుత రికార్డుని దక్కించుకున్నారు. ఎప్పుడూ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎంతో యాక్టివ్ గా ఉంటూ, తన ఫ్యాన్స్ తో సినిమా, వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను పంచుకునే అలవాటున్న సూపర్ స్టార్, 2010 ఏప్రిల్ లో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. అయితే అప్పటినుండి మెల్లగా ట్విట్టర్ లో ఆయనకు ఫాలోవర్లు పెరుగుతూ వస్తూ, నేటితో ఏకంగా 9 మిలియన్ల ఫాలోవర్లకు చేరారు. అయితే ఇప్పటి వరకు మరే ఇతర సౌత్ ఇండియన్ హీరో కూడా అందుకోలేని ఈ అత్యద్భుత రికార్డు ని మహేష్ సొంతం చేసుకోవడం విశేషం. 

 

మొదట్లో కొంత రిజర్వుడుగా వ్యవహరించే అలవాటున్న మహేష్, మెల్లగా అభిమానులతో పాటు ఇతర సినిమా ప్రముఖులతో కూడా మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఇక నేటితో మహేష్ 9 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆయనకు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు తో మంచి విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్, తను నటించబోయే తదుపరి సినిమాని అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: